52
 

అంత పొడుగువాడు కాదు, అంత పొట్టివాడు కాదు చేమ‌కూర ల‌క్ష్మ‌ణామాత్య త‌న‌యుడు వేంక‌ట‌ప‌తి. త‌న ఏకోద‌రులైన త‌మ్ముల్నీ, సూర‌మాంబ‌దేవి కుమారుడైన చేమ‌కూర అన్న‌మ‌రాజునీ అతి ప్రేమ‌తో చూస్తూ వాళ్ళంద‌రికీ తానే గురువై విద్య‌ల‌న్నీ బోధిస్తూ ఉండేవాడు. అన్న‌గారంటే తమ్ముల‌కూ చెల్లిలికీ గౌర‌మూ ప్రేమా, చెల్ల‌లు సూర‌మాంబ త‌న‌య‌కు వేంగీ సీమాధిప‌తి మంత్రి కొల‌నిపుర శ్రీనివాస‌మంత్రి కొమ‌రుని కిచ్చి వివాహ‌ము చేసినారు. ఆమె అత్త‌గారింటికి కాపుర‌ము చేయ‌డానికి వెళ్ళిపోయిన‌ది. ఇంతలో ల‌క్ష్మ‌ణామ‌త్యులు చ‌టుక్కున రెండు దినాలు జ్వ‌ర‌ము వ‌చ్చి, త‌న అరువ‌ది ఏడ‌వ ఏడున చ‌నిపోయినాడు.

ఈలోన‌నే గోల‌కొండ న‌వాబుల దుస్తంత్రాలు ఎక్కువైపోయిన‌వి. విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్య బ‌లం త‌గ్గిపోగానే, తూర్ప‌తీరం పొడుగునా తెలుగు సామంతులు ఒక విధ‌మైన స్వాతంత్యం పొందినారుగాని, మ‌ళ్ళీ పెనుగొండ నుండి చ‌క్ర‌వ‌ర్తి సైన్యాలు వ‌చ్చేస‌రికి సామంతులంద‌రూ క‌ప్పాలు స‌మ‌ర్పించుకొన్నారు. తిరుమ‌ల రాయ‌లు పోయినారు. ఆయ‌న పెద్ద‌కుమారుడు రంగ‌రాయ‌ల రాజ్య‌మ‌యి పోయిన‌ది. రంగ‌రాయ‌ల వెనుక తిరుమ‌ల‌రాయ‌ని రెండ‌వ కుమారుడు వేంక‌ట‌ప‌తి రాయ‌లు చ‌క్ర‌వ‌ర్తి అయినాడు. వేంక‌ట‌ప‌తి రాయ‌లుంవారు స‌మ‌ర్ధులు. విజ‌య‌న‌గ‌రాంధ్ర మ‌హాసామ్రాజ్యాన్ని శ్రీ కృష్ణ‌దేవ‌రాయులుంవారి ప‌రిపాల‌న‌లో ఉన్న మ‌హోత్త‌మ‌స్థితికి తీసుకురావాల‌ని సంక‌ల్ప‌ము చేసుకొన్నారు.

ఆ స‌మ‌యంలోనే ద‌క్షిణ భార‌తాన బుడుత‌కీచుల‌నే పోర్చుగీసు వారు పాదుకొని పోయారు. వారు వ‌ర్త‌కానికి వ‌చ్చి, కృష్ణ‌దేవ‌రాయ‌ల కాలం ముంద‌ర‌నే, క‌ళ్ళికోట‌రాజు అనుమ‌తితో గోవాలో వ‌ర్త‌క‌స్థానం ఏర్పాటు చేసుకొన్నారు. వారు నెమ్మ‌దిగా సింహ‌ళంలో, తూర్పుతీరంలో వ‌ర్త‌క స్థానాలేర్ప‌ర‌చుకొన్నారు. ఆ వ‌ర్త‌క స్థానాల్ని సంర‌క్షించుకొన‌డానికి సైన్యాలు ఉంచుకొన్నారు. ఈ పోర్చుగీసు వారు కృష్ణ‌దేవ‌రాయాది ద‌క్షిణ భార‌తీయ దేశాధిప‌తుల‌కు తుపాకులు స‌ర‌ఫ‌రా చేయ‌డ‌ము సాగించినారు.

పోర్చుగీసువారి స‌హాయం కోరిన రాజుల‌కు త‌మ సైన్యాద‌ళాలు పంపి రాజుల‌కూ రాజుల‌కూ మ‌ధ్య వ‌చ్చిన యుధ్ధాల‌లో పాల్గొని లాభం పొందుతూ వ‌చ్చినారు. వ‌ర్త‌క‌లాభం, బ‌హుమాన రూప‌మైన ధ‌న‌క‌న‌క వ‌స్తులాభం, క్షేత్ర‌లాభం పొందుతూ ఉండిరి వీరి రాజ‌నీతి దుష్ట‌మై ఉండేది. త‌మ మ‌త గురువులైన జెస్కూటు ఫాద‌రీల‌ను తీసుకువ‌చ్చి, హీన‌స్థితికి పోయిన వారికెంద‌రికో క్రైస్త‌వ మ‌త‌దీక్ష ఇస్తూ మ‌త ప్ర‌చారం తీవ్రంగా సాగించేవారు.

వ‌ట్టి వ‌ర్త‌కానికి వ‌చ్చి, వ‌ర్త‌కంతో మాత్రం సంతృప్తిపొంది ఉంటే, ఈ తెల్ల‌జాతుల వాళ్ళంటే రాజుల‌కూ ప్ర‌జ‌ల‌కూ అంత కోపం క‌లిగి ఉండేదికాదు. కాని ఒక‌ రాజ‌కుటుంబంలో ఏ దాయాదో, త‌మ్ముడో, కొడుకో, ఏ సేనాప‌తో, రాజబంధువో తిరుగుబాటుచేస్తే, ఆ తిరుగుబాటు దారైన రాజ‌ద్రోహిక‌డ త‌మ‌కు బాగా లాభించేట‌ట్లు సంధి చేసుకొని, పత్రాలు రాయించుకొని, ఆ రాజ‌ద్రోహికి స‌హాయం చేయ‌డం పోర్చుగీసువారి రాజ‌నీతిలో ముఖ్య నీతి.

తిరువాంకూరు స‌ముద్ర‌తీర వాసులైన స‌ర‌వ‌ల‌నే ప‌ల్లె వారికి ఫార్ మిగు ఏల్ వాజ‌న్ అనే మ‌త బోధ‌కుడు క్రైస్త‌వ‌మ‌త దీక్ష ఇచ్చినాడు. వారికీ, మ‌తంలో క‌లియ‌ని ప‌ల్లె వారికి త‌గాదాలు వ‌స్తూ ఉంటే పోర్చుగీసు నావికా ద‌ళాలు, సైన్యాలు క్రైస్త‌వ స‌మ‌రుల‌కు స‌హాయం చేసేవారు. అందువ‌ల‌న రామ‌రాజ విఠ్ఠ‌లున‌కు కోపంవ‌చ్చి, మ‌తం మార్చుకున్నంత మాత్రాన దేశం ఏలే చ‌క్ర‌వ‌ర్తికి రాజ‌భ‌క్తి చూపించ‌క ఎక్క‌డో ఉన్న బుడ‌త‌కీచురాజుకు వీళ్ళు రాజ‌భ‌క్తి చూసిస్తారా ? అని సైన్యాలు తీసుకువెళ్ళి, ఆ క్రైస్త‌వుల‌ను ఓడించి వారితోబాటు బుడ‌త కీచుల‌ను ఓడించి, వారంతా చ‌క్ర‌వ‌ర్తికి క‌ప్పం క‌ట్టేట్లు చేసినాడు.

పోర్చుగీసువారు చోళ‌మండ‌ల తీరంలో మొట్ట‌మొద‌ట నాగ‌ప‌ట్ట‌ణంలో వారి వ‌ర్త‌క‌కేంద్రం నిర్మాణం చేసుకున్నారు. అలాంటి రేవు స్థానం తూర్పు తీరాన్ని శాన్‌ధోము న్నూ, ప‌డ‌మ‌టి తీరాన్ని మంగ‌ళూరున్నూ, సింహ‌ళ తీర రేవు ప‌ట్ట‌ణాల‌న్నీ వారాక్ర‌మించారు.

తిరుమ‌ల‌రాయ చ‌క్ర‌వ‌ర్తి కాలంలోనే పోర్చుగోసువారి రాజ్యాధికారం ఎక్కువ అవ‌డంచేత పోర్చుగ‌ల్ దేశ‌పురాజు భార‌తీయ పోర్చుగీసు స్థానాల‌న్నిటికి క్రీ.శ‌. 1568లో దియోగో ఫెర్నాండెజ్ పెనో ఆ అనే అత‌ణ్ణి గ‌వ‌ర్న‌రుగా నియ‌మించాడు.

బుడ‌త కీచుల త‌ర్వాత భార‌త‌దేశాదుల‌కు వ‌ర్త‌కానికై వ‌చ్చిన‌ది డేనులు, ఒలాందులు (డ‌చ్చివారు) ఫ్రెంచివారు, ఇంగ్లీషువారుర్నూ, పోర్చుగీసువారి వెంట‌నే వ‌చ్చిన డచ్చివారు, పోర్చుగీసువారు స‌హాయం చేసేవారికీ వ్య‌తిరేక ప‌క్షంవారికీ స‌హాయం చేస్తూ ఉండిరి.