63
 

అదేమిషోయ్ ! నీ వంత చ‌దువ‌రి కొడుకువ‌లె నుండి ఇషువ‌లె మాట‌లాడుచున్నావు ? అన్నాడు, యాత్రిత‌కుల‌లో పెద్ద‌నామాలు పెట్టిన నామాల‌దాసు. అత‌డు ధ‌నుర్మాసంలో తిరుక్కుర‌ళ్ పాడుకుంటూ ఊంఛ‌వృత్తి చేసికొంటాడ‌ట‌. మిలిగిన రోజుల‌లో మ‌న్నారు కోవెల‌లో స్వామి వారికి నివేద‌నం చేసే చ‌తుర్విధాన్నాల‌ను భుజిస్తూ కాలం గ‌డుపుకొంటాడ‌ట ! శ‌రీరం పరిశ్ర‌మ‌లేక భారంగా పెరిగిపోయిన‌ది. ఇన్సుర‌స్సుర‌నుకొంటూ వారి వెంట న‌డుస్తున్నాడు.

నామాల‌దాసు చెల్లెలు, భార్య‌, చెల్లెలు భ‌ర్త చిదంబ‌రం, వారి సంతాన‌ము రామేశ్వ‌రం కుంభ‌కోణం యాత్ర‌లు చేసి రావాల‌ని బ‌య‌లుదేరినార‌ట‌. చిదంబ‌రం శివ‌భ‌క్తుడు. అందుచేత దోసెడు నామాల‌నుద్ద‌ని అర‌గ‌దీసి నుదుట‌ను అడ్డంగా ప‌ట్టించినాడు. విభూతి సుద్దంత తెల్ల‌గా క‌నుపించద‌ట !ఆడ‌వారిద్ద‌రూ కుడి పైట‌ల‌ను వేసికొని క‌చ్చాబిగించి, చీర‌ల‌ను అదొక తీరుగ క‌ట్టినారు. నుదుట‌ను పెద్ద‌కాసంత కుంకుమ‌బొట్టు. నిరంత‌రం తాంబూల చ‌ర్వ‌ణం. ప‌ళ్ళు న‌ల్ల‌గా గార‌ప‌ట్టి వికారంగా ఉన్న‌వి. వారిదీ వీరిదీ తెలుగుభాషే అయినా ఇరువురూ సగంస‌గ‌మే అర్ధం చేసికొగ‌ల్గినారు. ఏమిషోయ్ అన్న‌మ‌రాజు ! నీవు కూడా ఈలాంషి భాష నేర్చుకోవ‌ల‌సి ఉంటుంది ! అని వేంక‌ట‌ప‌తి హాస్య‌ము చేసినాడు. ఆక‌ట్టేమిటి ! ఆ బొట్టేమిటి ! ఆ మాట‌ల తీరేమిటి ! అని వారి మాట‌ల‌కు వీరు, వీరు మాట‌ల‌కు వారు వెనుక‌కు తిరిగి న‌వ్వుకొన్నారు. ఈ పాటి హాస్య‌ము వారి స్నేహానికి అడ్డురాలేదు ఒక‌టిన్న‌ర దిన‌ము క‌ల‌సి ప్ర‌యాణం చేసిన త‌రువాత వారి మార్గ‌ము వేరైన‌ది. పుదుక్కొట్టై రావ‌లెన‌ని మ‌రిమ‌రి ఆహ్మానించి వీడ్కోలు పుచ్చుకున్నారు.

జీవిత‌మే ఒక పెద్ద ప్ర‌యాణ‌ము. మార్గ మ‌ధ్యాన అనేకులు క‌లియుట విడ‌పోవుట తప్ప‌దు. నిజ ప్ర‌యాణంలో కూడా అంతేక‌దా అవి అన్న‌ద‌మ్ములిద్ద‌రూ ఒకిరిని చూచి ఒక‌రు ముసిముసి న‌వ్వులు న‌వ్వుకొన్నారు.

దూరాన గుఱ్ఱ‌పు డెక్క‌ల చ‌ప్పుడు ! మ‌ర‌ల దొంగ‌ల‌గుంపు కాదు క‌దా ! వ‌స్తున్న‌ది ఒక్క గుఱ్ఱ‌మేనోయ్ త‌మ్ముడూ ! దారికొట్టేవారెప్పుడూ ఒంట‌రిగారారు ఇద్ద‌రూ సందేహంగా చూస్తూ బండ్ల‌నాప‌మ‌ని సంజ్ఞ‌లు చేశారు. ఇంద్రుడి కాలు ఇంకా పూర్తిగా న‌యం కాలేదు. అది ఎంత మెల్ల‌గా న‌డ‌చిన‌ప్ప‌టికీ త‌మ‌కంటె క్రోసెడు ముందున్న‌ది, మిగిలిన గ‌జ‌ములు, అశ్వ‌ములు దాని వెనుక‌నే అనుస‌రిస్తూ న‌డుస్తున్న‌వి.

అన్నిటిక‌న్న వెనుక‌నున్న‌వి సామ‌నుబండ్లు, ఆడ‌వారిబండ్లు, వారి వెన‌క‌నే వారిని అనుస‌రిస్తూ, అశ్వ‌ముల‌పై నలుగురు సేవ‌కులు, సోద‌రులిరువురున్నూ. డెక్క‌ల చ‌ప్పుడు ద‌గ్గ‌రైన కొల‌దీ వేంక‌ట‌ప‌తి గుండె వేగ‌ము కూడ హెచ్చైన‌ది. మ‌ర‌ల‌నింక కొన్ని గుఱ్ఱ‌ములు వ‌స్తున్న‌ధ్వ‌ని, ఎందుకొచ్చిన ప్ర‌యాణ‌ము ? ఉన్న ఊరిలోనే కాల‌ము గ‌డ‌ప‌వ‌ల‌సిన‌ది. క‌విగా త‌న‌ను గుర్తించ‌లేద‌ని, అంద‌ల‌మెక్కించ‌లేద‌ని అవ‌మాన ప‌డినాడేగాని ఇన్ని ఇక్క‌ట్లు దారిలో కాచుకొని ఉన్నాయ‌ని యోచించ‌లేదు. మ‌ల‌ర ఏమి ముంచుకు వ‌స్తున్న‌దో అని కించ‌ప‌డినాడు.

అబ్బాయీ ! మ‌ళ్ళీ ఆ దండే వ‌స్తోన్న‌దేమోరా ! నువ్వేమో ఒక్క‌టే గుఱ్ఱ‌మంటున్నావు ? అన్న‌దాత‌ని త‌ల్లి, సందేహంగా.

అవున‌మ్మా, చాల‌నే వ‌స్తున్న‌ట్లున్నాయి. రానీయి ఈనాడు అటో ఇటో తేలిపోవాలి అన్నాడాత‌డుచ నిశ్చ‌యంగా.

ముందు వ‌చ్చిన గుఱ్ఱ‌ము మీద సాధార‌ణ సైనికునివ‌లె ఉన్న‌వ్య‌క్తి వేంక‌ట‌ప‌తి వ‌ద్ద‌కు వ‌చ్చి ఆగినాడు. ఇరువురు ఒక‌రినొక‌రు అనుమార‌పు దృక్కుల‌తో చూచుకొన్నారు.

సైనికుడు : ఎక్క‌డివాడివి ? ఎక్క‌డికి పోతున్నావు ?

వేంక‌ట‌ప‌తి : నీవు రాజ‌సైనికుడివ‌లె వున్నావు. దొంగ‌ల‌ను దోపిడీగాండ్ర‌ను స్వేచ్ఛ‌గా వ‌ద‌లి బాల‌సారుల‌ను ప‌ట్టి ప్ర‌శించ‌డ‌ము ఈ దేశ‌పు ఆచార‌మా అది ముందుచెప్పు.

అయితే నీవీ దేశ‌పు వాడ‌వు కావ‌న్న‌మాట‌, ఇటువేపొక‌దండు వ‌చ్చి వెళ్ళింద‌ని తెలిసింది. వారిని నీవు చూచిన‌ట్లున్న‌దే !

చూడ‌డ‌మేమిటి ? నా భుజ‌బ‌లాన్ని కొంచెం రుచి కూడా చూపించాను.

ఓహో ! అంత‌టి వీరుడ‌వా ?

కాక? అయితే నాతో చేయి క‌లుపుతావా ?

భ‌లే బాగున్న‌ది నీ మాట ! నీ భుజ‌కండూతిని తీర్చ‌డానికి నేను క‌న్పిస్తున్నానా, లేక నేను చెప్పిన మాట‌ల‌మీద న‌మ్మ‌కం లేకనా ? లేక‌పోతే, చూడు న‌న్నింత సేపు నిల‌వ‌రించావు నీకు రాచ‌కార్యాలు లేకనా ?

చూడ‌బోతే నువ్వు క‌లిలాగున్నావు, ప్ర‌శ్న‌కు త‌గిన స‌మాధ‌న మీయ‌క చుట్టుచుట్టి ఏదో అడిగితే ఏదో చెపుతున్న‌వు ?