66
 

ఎవ‌రుమీరు ? అని కంగారుగా ప్ర‌శ్నంచారు.

మిత్ర‌మా ! నేను ! రాత్రి వ‌స్తాన‌ని మాట ఇచ్చాను క‌దా, అందుకు కొంత ఆల‌స్య‌మైనా వ‌చ్చాను. వ‌స్తూ ఉంటే మీ సేవ‌కుడు పాడేపాట క్రోసెడు దూరానికి వినిపిస్తోంది. ఆ నిశబ్ద నీర‌వ నిశీధిలో స‌ర్వ దుఃఖ‌మ‌య ప్ర‌పంచాన్ని త‌న‌రాగంతో ల‌యంచేసి పున‌‌రుజీజ్జ‌వింప చేస్తున్నాడ‌త‌ను. మెల్ల‌గా గుఱ్ఱాన్ని దూరంలోనే నిలిపి స‌వ్వ‌డి చేయ‌కుండా వ‌చ్చాను. వ‌చ్చేస‌రికి మీ సోద‌రుల సంభాష‌ణ మ‌హాప‌సందుగా సాగిపోతోంది. ఇలాంటి మాట‌లు వింటుంటే నేను స‌ర్వం మ‌రిచిపోతాను. నా సాహిత్య‌పిపాస తీర‌నిది.

వేంక‌ట‌ప‌తిరాజు విస్తుపోతూ విన్నాను . సైనికా ! నువ్వు సామాన్యుడ‌వు కావోయీ _

స‌రే నా ప్ర‌శంస త‌రువాత‌. ముందు నా స‌మ‌స్య‌ను తీర్చు. వారి దుఃఖాన్ని మ‌నం అనుభ‌విస్తామ‌న్నావు. వారనుభ‌వించే సుఖాన్ని కూడా మ‌న‌ము అనుభ‌విస్తామా చెప్పు.

లేదు లేదు వారి సుఖాన్ని మ‌నం పూర్తిగా స్వానుభ‌వంగా మ‌ల‌చుకోలేము. ఎందుచేత‌నంటే మ‌నుష్య హృద‌యం దుఃఖానికి క‌ద‌లినంత‌గా సుఖానికి ప్ర‌యాణించ‌లేదు. సీతారాముల ఏ స‌మ‌స్య‌లూ లేక‌, ఆనందంగా ఆడుకుంటూ పాడుకుంటూ, వ‌న సంచారం చేస్తూ ఒక‌రినొక‌రు శృంగార దృక్కుల‌తో చూచుకొంటూ, పూల‌విల్తుని బాణాల‌కు లోనై ప‌ర‌మ సంతోషంగా కాలంగ‌డుపుతూ ఉంటే రామాయ‌ణం ఇన్నివేల సంవ‌త్స‌రాల పాటు ఇలా చిర‌స్తాయిగా, నిత్య‌నూత‌నంగా నిలిచేదీకాదు, నిలిచినా ఇంత‌గా జ‌నాద‌ర‌ణ ల‌భించేదీకాదు.

అయితే మ‌నంత‌ట మ‌నమే దుఃఖాన్ని కోరుతున్నామంటావు. అంతేనా ?
నిస్సందేహంగా అంతే

రామాయ‌ణం ఇంత‌కాలం నిల‌వ‌డానికి కార‌ణం రాముడు దేవుడ‌నీ కాదు, రావ‌ణాసురుడుని చంపినందుకూ కాదు, అందులో ఉన్న అంతులేని దుఃఖ‌మే నంటావు.

పూర్తిగా శోక‌మే కార‌ణం అని నేను అన‌డంలేదు. ఇది ముఖ్య‌కార‌ణం. ఇంకా కార‌ణాలు అనేకం ఉన్నాయి.

అన్న‌మ‌రాజు : అయితే అన్న‌య్యా ! నువ్వు ర‌చించే సారంగ‌ధ‌ర చ‌రిత్ర కూడా పూర్తిగా దుఃఖ‌మ‌య‌మేక‌దా ? అదీ రామాయ‌ణంలాగ జ‌నాద‌ర‌ణ‌పొంది చిర‌స్ధంగా ఉంటుందంటావా ?

వేంక‌ట‌రాజు : త‌మ్ముడూ ! ఇది నేను వ్రాస్తున్నాను క‌నుక ఆ చంద్ర‌తారార్కం ఉంటుంద‌ని చెప్ప‌డం ఆత్మ‌స్తుతి అనిపించుకొంటుంది. రామాయ‌ణం ఇతిహాసం. ఒక దివ్య‌స్త్రీ ఒక దివ్య పురుషుడు నాయికా నాయ‌కులు, సారంగ‌ధ‌ర అలాకాదు. దానికీ దీనికీ పోలిక లేక‌పోయినా దీనికీ జీవికే ఉండ‌గ‌ల‌దు.

సైనికుడు : మిత్ర‌మా, చెప్పావుకావు. సారంగ‌ధ‌ర చ‌రిత్ర మంటే గౌర‌న వ్రాసిన న‌వనాధ చరిత్రంలోని గాధేనా ?

అవును. చౌరంగి గాధే.

అన్న‌మ‌రాజూ ! మీ అన్న‌య్య నువ్వ‌డిగిన ప్ర‌శ్న‌కు గోడ‌పై పిల్లివాటంగా స‌మాధానం చెప్పాడు. కేవ‌లం ఏడుపును చూసి స‌హృద‌యులు ఏడుస్తారంటాడు.

మ‌రి శృంగారం మాటేమిదో అడుగు ? మ‌ను చ‌రిత్ర‌లో ఉన్న‌దీ వ‌సుచ‌రిత్రలో ఉన్న‌దీ ఏమిటి ? శృంగారంకాదా ? ర‌సికులు లొట్ట‌లు వేసికొంటూ ప‌ఠించ‌డం లేదా ? మీ అన్న‌ను చెప్ప‌మ‌ను.

మిత్ర‌మా ! నేను చెప్ప‌గ‌ల‌ది ముందే చెప్పాను క‌దా ? నేను ఏమి చెప్ప‌లేక పోయానో అది నీకు తెలిసి ఉంది, కావున నీవే చెప్పాలి.

భావ‌ప్ర‌కాశ‌కారుడు ఏమి చెప్పినాడు ? నాయ‌కుడు తుష్టిపొంద‌గా తాసును తుష్టి పొందేవాడున్నూ, నాయ‌కుడు శోకించిన తానూ శోకించే వాడున్నూ, వాని

భ‌య‌కోపాదుల‌కు త‌నూ భ‌య‌కోపాదుల‌నందే వాడే స‌హృద‌యుడు శ్రేష్ఠ‌ప్రేక్ష‌కుడు అని చెప్ప‌లేదూ ?

సైనికా, నువ్వు చెప్పిన‌ది శాస్త్ర‌ము. నేను చెప్పిన‌ది అనుభ‌వ‌ము. నాయ‌కుని భావ‌ముల‌న్నిటినీ మ‌న‌ము అనుభ‌వించిన‌చో మ‌న‌కు ల‌భించున‌ది ఆనందముకాదు, ఉన్మాద‌ము !