127
 

స‌హ్య ప‌ర్వ‌తాంత‌రాల‌లో జ‌న్మ‌మెత్తిన కావేరి మ‌హాదేవి త‌న మ‌ధుర‌నీలాల‌ను తాను న‌డ‌యాడిన అన్ని తావుల‌కునూ ప్ర‌సాదించినప్ప‌టి కిన్నీ చోళ‌రాజ్య ర‌మాదేవిపై ఆమెకు మిక్కిలి మ‌క్కువ‌. పూర్వ‌మీ చోళ‌దేశాన్ని కుళోత్తుంగ చోళుడ‌నే ప్ర‌భువు పాలించే దినాల‌లో కావేరిన‌దికి గొప్ప ఆన‌క‌ట్ట‌ను నిర్మించినాడు. కావేరి న‌దిమ‌త‌ల్లి త‌న అమృత‌హ‌స్తాల‌తో దేశాన్ని స‌స్య‌శ్యామ‌లం చేసిన‌ది. విర‌గ‌పండిన పంట భూముల‌ను చూచిసాటి దేశాల‌వారు శాలివ‌నీని  చోళ‌మ‌ని వ్య‌వ‌హ‌రిస్తూ ఉండిరి. చోళ‌దేశాన‌కు కొల‌ది కాల‌ము ఒర‌యూరు రాజ‌ధానిగా ఉండెను. మ‌రికొంత‌కాల‌ము కుంభ‌కోణ‌ము, గంగై కొండ చోళ‌పుర‌ములు రాజ‌నిధానాలు కాగ‌లిగిన‌వి. దేశ‌మ‌ల్ల క‌ల్లోల‌ముగ నుండి యుద్ధ‌భ‌య‌ము వాటిల్లిన దినాల‌లో ప్ర‌భువులు తంజ‌పుర‌మున‌కు వ‌చ్చి, తాత్కాలిక‌ముగ నివ‌సించి, రాజ్య నిర్వ‌హ‌ణ‌మును చేయుచుండుట కూడ సంభ‌విస్తూ ఉండెను.

తంజ అను రాక్ష‌సి త‌న క్రూర‌కృత్య‌ముల‌తో ప్ర‌జ‌ల‌ను పీడిస్తూ ఉండ‌గా వారు శివ‌ప్రార్ధ‌న‌ల‌ను చేసిరి. భ‌క్తుల మొర‌ల‌ను ఆల‌కించిన దొడ్డ ప్ర‌భువు ప‌ర‌మ‌శివుడు ఆ ర‌క్క‌సిని సంహ‌రించి ప్ర‌జ‌ల‌కు శాంతి సంతోషాల‌ను ప్ర‌సాదించెను.

హ‌రుడు తంజ‌ను సంహ‌రించిన తావుగాన తంజ‌హ‌ర అనే పేరుతో ఆ న‌గ‌ర‌మును వ్య‌వ‌హ‌రించెడివారు. కాల‌క్ర‌మాన తంజ‌హర‌ము తంజ‌పుర‌మై తంజావూరు అయిన‌ది. చిన చెవ్వ‌ప్ప‌నాయ‌నిం వారి పాల‌న‌ము ప్రారంభ‌మైనప్పుడు తంజ‌పుర‌మును చోళ‌దేశాన‌కు రాజ‌ధానిగా శాశ్వ‌త ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చించినారు.
శ్రీ‌శ్రీ‌శ్రీ అచ్యుత‌నాయ‌క మ‌హారాజులు త‌మ‌పుత్ర‌ర‌త్న‌మైన శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌ఘునాథ నాయ‌కుల‌కు ప‌ట్టాభిషేక‌ము చేసి, శ్రీ‌రంగ‌పూరాన వాన‌ప్ర‌స్థాశ్ర‌మ‌మును స్వీక‌రించి, శేష‌శాయిని సేవించుకొంటూ ప‌దిమాసాల‌పాటు అఖండా నంద‌భూతిని పొందిన త‌దుప‌రి వైకుంఠ‌పుర‌వాసుల‌లైరి. ప్రియ‌నాధుల వియోగ‌మును భ‌రించ‌లేని మూర్తిమాంబా మ‌హారాణీవారు స‌ప‌త్నుల‌తో స‌హా అగ్ని ప్ర‌వేశం చేసి భ‌ర్త‌తో స‌హ‌గ‌మ‌న‌మును చేసిరి.

శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌ఘునాథ నాయుకుల‌వారి నేత్రాంబుజ‌ముల నుండి రుధిర‌ము స్ర‌వించిన‌ట్లయిన‌ది. ప‌క్వ‌మైన ఫ‌ల‌ము చెట్టునుండి ఊడిప‌డిపోయిన‌ట్లుగ శ్రీ అచ్యుత నాయ‌కులు ఇహ‌లోకావాస‌మును చాలించినందుల‌కు మ‌హాదుఃఖితుల‌యి నప్ప‌టికిన్నీ, త‌మ త‌ల్లుల‌ను అగ్నిప్ర‌వేశ‌మునుండి వారించుట‌కై తాము చేసిన య‌త్న‌ములు ఫ‌లించ‌నందుల‌కున్నూ ఇట్టి దురాచార‌మును త‌మ క‌న్నుల‌తో తాము చూడ‌వ‌ల‌సి వ‌చ్చినందుల‌కున్నూ శ్రీ ర‌ఘునాథుని హృద‌య‌ము తున‌క‌లు తున‌క‌లుగా వ్ర‌య్య‌లైన‌ది. మాతాపితురుల‌నొక్క‌మాటుగా కోల్పోయిన వారి శోక‌ము గుండెదాటి బ‌య‌ట‌కు రాలేదు. వారి క‌హ‌ర్నిశ‌లు ప్రజార‌క్ష‌ణ‌ము ధ‌ర్మ‌ర‌క్ష‌ణ‌ముల‌కే స‌రిపోకున్న వాయెను.

మ‌ధుర ప్ర‌భువుల‌ను యుద్ధ‌మున ఓడించి విజ‌య‌ల‌క్ష్మిని వ‌రించి నాటికి సంవ‌త్స‌ర‌కాల‌ము దాటిన‌ది. దేశ‌ములో శాంతి భద్ర‌త‌లు పీఠ‌ము వేసి కొని స్తిర‌ముగ కూర్చున్న‌వి. అన్న‌మ‌రాజు వంటి వీర‌నాయకులు అప్ర‌మ‌త్తులై వేయిక‌న్నుల‌తో ఎనిమిది దిక్కుల‌ను కాయుచుండిరి.

న‌ల‌నామ సంవ‌త్స‌ర, చైత్ర‌శుద్ధ‌, విదియా భృగువాస‌రాన తంజ‌పురా ధీశ్వ‌రులు, శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌ఘునాథ నాయ‌కుల‌వారు నిండు పేరోల‌గాన‌కొలువు తీర్చి ఉండిరి. ప‌ద‌చాళి, పేరిణి, జక్కిణి, దుర‌ప‌ద‌వేళి, దండ‌లాస్య‌ము మొద‌లైన శాస్త్రీయ‌, దేశీయ నాట్య‌ముల‌ను వీక్షించుచూ ఉండ‌రి. శుక‌వాణి రాభ‌ద్రాంబ‌లు ఆస్థాన‌మున సూర్య‌చంద్రుల‌వలె వీక్షించుచూ ఉండిరి. శుక‌వాణి రామ‌భ‌ద్రాంబ‌లు ఆస్థాన‌మున సూర్య‌చంద్రుల‌వలె ప్ర‌కాశిస్తూ ఉండ‌గా కృష్ణాధ్వ‌రి, రాజ చూడామ‌ణి, మొద‌లైన క‌విప్ర‌కాండుల క‌వ‌న‌ముల‌ను శ్ర‌వ‌ణ‌పేయ‌ముగ వినుచు ర‌ఘునాథ నాయ‌నిం వారు సంతుష్టాంత‌రంగులై ఉండిరి.

చేమ‌కూర వేంక‌ట‌క‌వి, విజ‌య‌విలాస‌ము అనే శ్లేష కావ్య‌మున‌కు శ్రీ‌కారము చుట్టినాడు.

ఏలిక మాత్ర‌మే ? మ‌హిమ‌నీశ్వ‌రుడే త‌ల‌పోసి చూడ నా
పాలిట రామ‌భ‌ద్రుడ‌ని బంగ‌రు బూవుల బూజజేసి నే
జాల న‌లంకృతింబొస‌గు స‌త్కృతికానుక‌జేసి కీర్తి భూ
శ్రీ‌ల‌లితాంగుల‌న్ వ‌ల‌వ‌జేసిన శ్రీ ర‌ఘునాథ శౌరికిన్‌.

అని వేంక‌ట‌క‌వి తాను గ‌త‌దిన‌మున వ్రాసిన గ్రంధావ‌తారిక‌ను స‌భ‌కు త‌న చెలిమికాడైన శ్రీ ర‌ఘునాథున‌కుగాక శ్రీరామ‌చంద్రున‌కైన త‌న కావ్య‌మును కాన్క చేయ‌న‌ని శ‌ప‌ధ‌ము జేసినాడు. ర‌ఘునాథ నాయ‌నిం వారికీయ‌పూర్వ స్నేహ మ‌మితానంద కార‌క‌మైన‌ది.