133
 

సైన్యాధ్య‌క్షుడు, మ‌హామంత్రీ ! పెనుగొండ నుండి మ‌న‌కు వేగు రాక‌పోవ‌చ్చున‌ని సెల‌విచ్చి ఉన్నారు అనినాడు అచ్చెరువుతో.

గోవింద : అవును, వేగు రావ‌చ్చును. రాక‌పోవ‌చ్చును. అయినా, అన్ని విష‌య‌ములు తెలియ‌క‌ముందు, మ‌న‌ము త్వ‌ర‌ప‌డి ఎట్టి నిర్ణ‌య‌మూ చేయ‌రాదు...

******

పెనుగొండ ప‌ట్ట‌ణాన ప్ర‌జ‌లు ముగ్గురు న‌లుగురు క‌ల‌సికొని ఏదో గుజ‌గుజ‌లు పోవుచుండిరి. ప్ర‌భువులు క్షేమ‌మేనా ? రాజ‌వైద్యులు అంతఃపుర‌ము నుండి వెలికి రావ‌డ‌మేలేదు. అమాత్యులు, ద‌ళాధిప‌తులు, సామంతులు లోనికి వెళ్ళిన‌వారు వెళ్ళిన‌ట్లే ఉన్నారుగాని, ఒక్క‌రూ తిరిగి వెల‌కి వ‌చ్చిన‌దిలేదు. మ‌హారాజుల ఆరోగ్య‌ము క్ష‌ణ‌క్ష‌ణ‌మున‌కు క్షీణించుచున్న‌ద‌ని ప్రాకార‌ము క‌డ‌నుండు కంచుకి ముఖ క‌ళ‌వ‌ళిక‌లు చెప్తూ ఉన్న‌వి.

అంతఃపురంలో నిత్య‌మూ ఫ‌లదానాలూ, పుష్ప‌దానాలూ పుచ్చుకొనుట‌పై వెళ్ళే పెద్ద ముత్తైదువ‌ల‌కు, ప్ర‌భువుల ప్రాణాలు ఎప్పుడో గాలిలో క‌లిసిపోయిన‌వేమో ! అని గాఢ‌మైన అనుమానం క‌లిగింది. ఈ అనుమానం వాళ్ళ‌వాకిళ్ళ స‌రిహ‌ద్దు ఆకుల‌ద‌డుల మీదుగా, ఇటుక‌ల గోడ‌ల‌మీదుగా రాచ‌వీధుల‌లోనికి ప‌ట్ట‌ణ‌ము న‌లుమూల‌లా గాలివేగాన కారుమేఘంలా క‌మ్ముకొని బోయిన‌ది. ఏమి జ‌రిగిందో అని ఆందోళ‌న‌, ఏమి జ‌రుగబోతున్న‌దో, అవి అతుర‌. గృహ‌స్థులెవ్వ‌రూ గృహ‌కార్యాలు నిర్వ‌ర్తించ‌డంలేదు. ప్ర‌జ‌లెవ్వ‌రూ ప‌నుల‌ను చేసికొన‌డం లేదు. ప‌ట్ట‌ణం మ్రాన్ప‌డిన‌ట్లున్న‌ది -

రాజ‌మందిరాన పరిస్థితులు ఇంకొక విధాన ఉండెను. సార్వ‌భౌములు, శ్రీ‌శ్రీ‌శ్రీ ఇమ్మ‌డి వేంక‌ట‌ప‌తి రాయ‌ల‌వారు త‌నువు చాలించే త‌రుణ‌ము చేరువ‌వుతూ ఉన్న‌ది. మ‌హారాణులను పరికిస్తూ ఉన్న‌ప్పుడు మ‌హారాజుల క‌న్నుల‌లో ఆలోచ‌న‌లు సుడులు తిరుగుతూ ఉన్నవి. త‌మ ప‌ట్ట‌మ‌హిషి ప‌ట్ల ప్రేమాభిమాన‌ముతో ఆమె కుహనా పుత్రుడు, విశ్వ‌ప‌తి రాయ‌లుకు రాజ్య‌ము క‌ట్ట‌బెట్ట‌డ‌మా, ధ‌ర్మానికీ, న్యాయానికీ, వంశ‌గౌర‌వానికీ త‌ల‌వంచి త‌మ త‌మ్ముని బిడ్డ‌డిని భావి సార్వ‌భౌమునిగా ప్ర‌క‌టించ‌డ‌మా ? మ‌హారాజులు మ‌హా సంఘ‌ర్ష‌ణ‌లో కొట్టుకొని, క‌ట్టుకొని తుదకొక నిర్ణ‌యానికి వ‌చ్చిరి. వారి వ‌ద‌నం ప్ర‌శాంమై, క‌నులు ప్ర‌కాశ‌వంత‌మైన‌వి.

సార్వ‌భౌములు, చెంత‌నే నిల‌బ‌డి ఉన్న త‌మ సోద‌రుని కుమారుడు, చిక్క‌రాయ‌ల‌ని పిలువ‌బ‌డే శ్రీ రంగ‌రాయుల‌ను క‌నుస‌న్న‌చే ద‌గ్గ‌ర‌కు రావించుకొన్నారు. శ్రీ రంగ‌రాయ‌ల‌తో పాటుగ సోమ‌శేఖ‌ర భ‌ట్టార‌క అమాత్యులున్నూ, ముఖ్య‌ద‌ళ‌వాయి వేలప్ప నాయ‌కుడున్నూ ప్ర‌భువుల చెంత‌కు అతుర‌తో వ‌చ్చిరి.

శ్రీ‌శ్రీ‌శ్రీ కుమార శ్రీ రంగ‌రాయ‌ల వారిని విజ‌య‌న‌గ‌ర సామ్రాట్టులుగ నిర్ణ‌యించినాము. కావున‌, రాజ్యాంగం యావ‌త్తున్నూ శ్రీ‌శ్రీ‌శ్రీ శ్రీ రంగ‌రాయ సార్వ‌భౌముల అజ్ఞాబ‌ద్ధులై ఉండ‌వ‌ల‌సిన‌ది, అని శ‌క్తి క్షీణిస్తూ ఉన్న‌ప్ప‌టికిన్నీ, విస్ప‌ష్టంగా గంభీర‌నాదంతో ప‌లికిరి. వెనువెంట‌నే త‌మ వ్రేలిని అలంకిరించిన రాజ‌ముద్రికాంగుళీయాన్ని శ్రీ‌శ్రీ‌శ్రీ చిక్క‌రాయ‌ల వ్రేలికి స్వ‌యంగా తొడిగి, ఆ విధ‌ముగ శ్రీ‌శ్రీ‌శ్రీ రంగ‌రాయ‌ల ప‌ట్టాభిషేక‌ము చేసి, త‌మ గుండెల‌కు ఆ హాస్తాన్ని ఆనించుకొని తుది శ్వాస‌ను వ‌దిలిరి. పెద‌నాయ‌న‌గారూ, నాకీ రాజ్య‌భారం వ‌ద్దండీ, అనిన శ్రీ‌శ్రీ‌శ్రీ శ్రీరంగ‌రాయ‌ల‌వారి మాట వారి గొంతులోనే అణ‌గిపోయిన‌ది. మ‌హాశోక‌మున మునిగిపోయిన పట్ట‌పురాణీవారు ఏమి జ‌రుగుతూ ఉన్న‌దో గ్ర‌హింప‌లేక‌పోయిరి.

ప‌ట్ట‌పురాణి బ‌య్యాంబికాదేవివారి తండ్రి, గొబ్బూరి జ‌గ్గ‌రాజు ప‌రిస్థితుల‌ను లోతుక‌నుల‌తో తీక్ష‌ణంగా ప‌రికిస్తూ ఉండిన‌వాడు, క్ష‌ణాల‌లో క‌నుమ‌రుగై పోయిన ద‌క్క‌డ ఉన్న రాజోబ్యోగులెవ్వ‌రునూ గ్ర‌హింప‌క పోయిరి. నాటికి ప‌ది దినాల నుండి, మ‌హారాజులు అస్వ‌స్థులైన‌ది మొద‌లు, జ‌గ్గ‌రాజు ర‌హ‌స్య కూట‌ముల‌ను ఏర్ప‌రుస్తూ వ్య‌వ‌హార నిమ‌గ్నుడై ఉన్న‌ది కూడ వారికి గాలి వార్త‌గా అయినా చేరిన‌దికాదు.

మ‌హాప్ర‌భువుల యెడ త‌మ‌కుగ‌ల భ‌క్తినీ ప్రేమ‌నూ, వారు త‌మ‌పై చూసిన ప్రేమాద‌ర‌ముల‌నూ త‌ల‌చుకొని హృద‌య‌ములు భార‌ముకాగా, త‌ల‌లువాల్చి, నిర్విణ్ణులై, కింక‌ర్త‌వ్య జ్ఞాన‌శూన్యాలై, నీర‌సించి, మ‌హారాజుల భౌతిక కాయ‌ము చుట్లూ నిల‌చిన రాజ‌భ‌క్తుల, రాజోద్యోగుల‌, రాజ‌బంధువుల వెన్నుల‌కు, ఇరువ‌ది మంది ఖ‌డ్గ‌ధారుల ఒక్కుమ్మ‌డిని లోనికి ప్ర‌వేశించి, త‌మ క‌ఠారుల‌ను ఆనించి కాలు క‌ద‌ప‌ల‌కుండ చేయ‌క‌ల్గిరి.