132
 

తంజ‌పురాధీశుల న‌వ‌వాడులు క్రుంగిన‌ట్ల‌యి, నోట మాట‌రాక‌, నిశ్శ‌క్తులైరి. త‌మ‌పై సార్వ‌భౌముల‌కుగ‌ల పుత్ర‌వాత్స‌ల్య‌ము త‌ల‌పుకురాగా లోలోన కుమిలిరి. గోవిందామాత్యుల‌కు మ‌హారాజుల హృద‌య‌శోక‌మ‌వ‌గ‌త‌మే. కొల‌దిక్ష‌ణాల‌కు శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌ఘునాథ నాయ‌నిం వారు తెప్ప‌రిల్లిరి. రాయ‌ప్పా, న‌గ‌ర‌ము శాంతిభ‌ద్ర‌త‌ల‌లో నుండెనా ? అని నింపాదిగా మంద‌స్వ‌రాన ప్ర‌శ్నించిరి. ప్ర‌భూ, పెనుగొండ ప్రేలుట‌కు సిధ్ధంగా ఉన్న అగ్ని ప‌ర్వ‌తంలా ఉన్న‌దని, చంద్ర‌గిరి సామంతులు త‌మ‌కు మ‌న‌వి చేయ‌మ‌న్నారు అని రాయ‌ప్ప‌, ఇక విన్న‌వించ‌వ‌ల‌సిన‌ది ఏమిన్నీ లేద‌న్ట‌ట్లుగ‌, చేతులు క‌ట్టుకొని నిలచినాడు.

రాయ‌ప్పా, ఇక నీవు సెల‌వు తీసుకోవ‌చ్చును అని సైన్యాధ్య‌క్షులు అనుజ్ఞ ఇచ్చినారు. రాయ‌ప్ప నిష్క్ర‌మించినాడు.

గోవిందామాత్య‌లు వైరాగ్య‌భావంతో న‌వ్వుకొన్నారు వేంక‌ట‌ప‌తి రాయ‌సార్వ‌భౌముల శ్రీ‌ముఖాన్ని కొనివ‌చ్చిన రాయ‌బారి పెనుగొండ తిరిగి చేరి ఉండ‌డు. శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌ఘునాథ నాయ‌నిం వారు శ్రీ వారికి ఆ రాయ‌బారి ద్వారా అంపిన లేఖ మార్గం మ‌ధ్య‌నే న‌శించిపోయి ఉండ‌వ‌చ్చును.

గోవింద : ప్ర‌భూ, మ‌న‌కు పెనుగొండ నుండి ఎట్టి వార్తా రాకుండా రాజ ద్రోహులు క‌ట్టుదిట్టంచేసే ఉందురు. మ‌న మీ రాయ‌ప్ప వేగు మీద‌నే క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌ర్తించుకోవ‌ల్సి ఉన్న‌ది.

మ‌హారాజు : గురుదేవా, సార్వ‌భౌముల సందేశాన్ని మ‌రొక‌మారు ప‌రిశీలించ‌వ‌ల‌సిన స‌మ‌య‌మాస‌న్న‌మైన‌ది.

మ‌హారాజుల భావ‌మెరిగిన సైన్యాధిప‌తి ర‌హ‌స్య‌మందిర‌ము నుండి చ‌క్ర‌వ‌ర్తులు అంపించిన శ్రీ‌ముఖ‌మును తెచ్చి స్వ‌య‌ముగా చ‌దివి వినిపించెను.

శ్రీ‌శ్రీ‌శ్రీ చోళ‌మండేశ్వ‌రులున్నూ, క‌వితా మ‌ర్మ‌జ్ఞులున్నూ, సాహిత్య‌త‌త్త్వ కోవిదులున్నూ, త‌ర్క‌వ్యాక‌ర‌ణాలంకారాది స‌మ‌స్త సార‌స్వ‌త శాస్త్ర‌శోధ‌కులున్నూ, ర‌ఘునాథ భూపాల‌వీణ సృష్టి క‌ర్త‌లున్నూ, రాగ‌తాళ శృతిల‌యాల‌ను చతుస్స‌ముద్ర‌ముల‌నాపోస‌న ప‌ట్టిన అగ‌స్త్య ఋషితుల్యులున్నూ, ధ‌ర్మ‌ర‌క్ష‌ణ త‌త్ప‌రులున్నూ అయ్న‌మ‌దీయ‌పుత్ర స‌మానులు ర‌ఘునాథ నాయ‌కులం వారిని, విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్యాకాశ అస్త‌మ‌య సూర్యులు శ్రీ‌శ్రీ‌శ్రీ ఇమ్మ‌డి వేంక‌ట‌ప‌తిరాయ సార్వ‌భౌములు ఆశీర్వ‌దించి వ్రాయించ్ని స్నేహ శ్రీప‌త్ర‌ము.

నాయ‌నా, ర‌ఘునాథ ! నీ రాజ్య‌ము శాంతి భ‌ద్ర‌త‌ల‌తో సంతోష ఆనందముల‌తో తుల‌తూగుతూ ఉన్న విష‌యాల‌ను వేగులు విన్పిస్తూ ఉన్నారు. పెనుగొండ రాజ్య‌ల‌క్ష్మిని నీ భుజ‌శౌర్య‌శ్రీ‌తో ప‌రిర‌క్షించిన ప‌ర్వ‌దినాన విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్య క‌న‌క సింహాస‌నాన నా స‌ర‌స‌న నిన్ను కూర్చుండ బెట్టుకొన్న‌పుడు, పుత్ర‌ప్రేమ‌తో ఈ వృద్ధ శ‌రీర‌మున‌కు జ‌నించిన పుల‌క‌లు ఇంక‌నూ నిత్య‌స్పృహ‌ణీయ ములుగ‌నే ఉన్న‌వ‌య్యా, తండ్రీ, నీ మూర్డాభిషేక మ‌హాశుభ స‌మ‌యాన వేడ్క‌తో కాన్క‌చేసిన గ‌జ తుర‌గ‌ములు మీ శాల‌లో విశ్ర‌మిస్తూ ఉన్న‌వా ?

ర‌ఘునాథ నాయ‌కా, నా త‌రువాత ఈ సింహాస‌నం కొఱ‌కు అంత‌ర్యుద్ధాలు త‌ప్ప‌వని అనిపిస్తూ ఉన్న‌ది. ద‌క్షిణ భార‌తావ‌నిని నిన్ను మించిన శూరులు, ధ‌ర్మ‌ర‌క్ష‌ణ త‌త్ప‌రులు లేరు. నీకొక నిగూఢ విష‌యాన్ని తెలియ‌జేయ‌వ‌ల‌సిన స‌మ‌యమాస‌న్న‌మైన‌ది.

మా ప‌ట్ట‌పురాణి బయ్యాంబికాదేవివారు, ప‌ద‌మూడు సంవ‌త్స‌రాల నుండీ త‌మ క‌న్న‌కుమారుడ‌ని అత్యంతాభిమ‌నంతో సాకుతూ ఉండిన చిన్న‌వాడు విజ‌య‌న‌గ‌ర సార్వ‌భౌముల వంశాంకురం కాదు ఈ అస‌త్యాన్ని ఇన్ని నాళ్ళుగా హృద‌య‌భారంగా మోస్తూ ఉండ‌డానికి గ‌ల కార‌ణం, కేవ‌లం రాణి వారిపై మాకుగ‌ల ప్రేమాతిశ‌యం మాత్ర‌మే. రాణీవారి ప్రేమ‌పుత్రుడు బ్రాహ్మ‌ణ బాల‌కుడ‌ని కొంద‌రు ప్ర‌ముఖుల‌కు విధిత‌మే. అందుచేత సింహాస‌నం కొర‌కు మాత‌ద‌నంత‌రం సంభ‌వించే పోరాటంలో ప్ర‌జ‌ల‌కు ఎట్టి క‌ష్ట న‌ష్టాలూ క‌లుగ‌కుండా గ‌మ‌నించి కాపాడే బ‌రువు బాధ్య‌త‌ల‌ను నీ భుజ‌స్కంధాల‌పై ఉంచుతూ ఉన్నాను. ధ‌ర్మం జ‌యించుగాక --

సార్వ‌భౌముల నుండి మ‌రియొక లేఖ కొర‌కు ఎదురు చూస్తూ ఉన్న త‌రుణంలో రాయ‌ప్ప మోసుకు తెచ్చిన మ‌హాదుఃఖ వార్త‌విని ర‌ఘునాథ మ‌హారాజులు క్రుంగిపోయిరి.

ర‌ఘు : గురుదేవా ! మ‌న‌క‌ర్త‌వ్యం ?

గోవింద : ప్ర‌భూ ! ఈ రాయ‌ప్ప చంద్ర‌గిరి నుండి వ‌చ్చినాడు. పెనుగొండ నుండి మ‌న‌కు వేగు రావ‌ల‌సి ఉన్న‌ది అంత‌వ‌ర‌కు మ‌న‌ము చేయున‌ది లేదు. ఓరిమిప‌ట్టి వేచి ఉందాము.