యజ్ఞనారాయణుని మాటలకు అప్పయ్య దీక్షితులు ఉలికిపడిరి. సంప్రదాయ పాలనా ప్రియులైన పూర్వ విద్వాంసులనీ కుఱ్ఱవాడు వ్రేలెత్తి చూపించడమా ! అన్న ఆశ్చర్యముతో లేచి కూర్చుని మిత్రుని చూచిరి. గోవింద మంత్రి నిద్రావస్థలో నున్నట్లుండెను.
మామయ్యగారూ ! అన్నది సమస్త ఆహార పదార్ధములున్నూజీర్ణకోశాన వైశ్వానరాగ్ని సాయంతో జీర్ణింపగాతత్సారము రక్తరూపాన శరీరమంటికీ ప్రవహించి ఓజోరూపం దాల్చగల్గుతాయి. అలా జీర్ణించనపుడు ఎంతటి బలవర్దకమైన పదార్ధమైనా వమనరూపాన బయల్వెడలి వ్యర్ధమైపోవడు జరుగవచ్చు. ఇక విద్య అనేది అటువంటిదికాదు. నేర్చిన సర్వ విద్యల సారము జ్ఞాన రూపాన మేధస్సునకు చేరుతుందే తప్ప జీర్ణకోశానకు చేరరు. ఇక తాను నేర్పిన విద్యలను క్రక్కమని గురువు ఆదేశించినాడు. కావున దీనికి అంతరార్ధ మొకటున్నట్లుగ భావించవలెను. శిష్యుడు తాను నేర్చిన విద్యలను ఉపయోగించుకొన రాదనేదే గురవు ఆదేశమై ఉండవచ్చును. ఇక ఇతర మునులు యాజ్ఞవల్క్యుడు నేర్చినదానిని రహస్యముగ వచ్చి నేర్చియుండ వచ్చును. అందుచేత, అకాలము వారిచేత కొంత తక్కువగ చూడబడి పక్షులనే మారు పేర్లతో పిలువబడియుండవచ్చును అనినాడు, యజ్ఞనారాయణుడు.
అప్పయ్య దీక్షితులవారికి పరమానందముతో తలమునకలైనది. భళిరా ! కులపతీ ! ఇలాంటి వివరణమునింతకు ముందెవ్వరూ చేసి ఉండలేదు ! అని వెన్నుతట్టరి. నీవంటి సూక్ష్మబుద్ధికి నేను చెప్పవలసినది ఏమి ఉంటుంది ? అయినా, మరొకమారు చర్చించుకొందాము, అని విశ్రమించినారు.
17
శ్రీశ్రీశ్రీ రఘునాథ మహారాజులవారు నిండు పేరోలగాన కొలువు తీర్చి ఉన్నారు.ఆనాటి సభలో నాట్య ప్రదర్శనను సభ్యులు ఉత్కంఠ మనస్కులై తిలకిస్తూ ఉండిరి. కృష్ణాతీరస్థుడైన వరదయ్య అనే కవికుమారుడు అల్లిన పదవకితలకు నాట్య కళాకారులు ప్రాణము పోసినట్లుగ రూపకల్పన చేసి అభినయిస్తూ ఉండిరి. పరదయ్య నిత్యసంచారియై అనేక దివ్య క్షేత్రములను దర్శిస్తూ, క్షేత్రపాలకులైన దేవలతను తన పదకవితలతో అలరిస్తూ, మందమారుతములా ప్రజలకాహ్లాదమును కలిగిస్తూ ఉండెను. వరదయ్య క్షేత్రయ్యమై అడుగిడిన తావులన్నిటిని తనకవన మాధుర్య పరీమళములలో నింపివేయుచుండెను.
క్షేత్రయ్య సప్తగిరీశ్వరుని సన్నిధిలో శ్రీమన్నారాయణుని దివ్యలీలలను కీర్తిస్తూ ఉండి, తదుపరి జింజిమీదుగా శ్రీరంగమునకు పయనించుటకు నిశ్చయించుకొనెను. క్షేత్రయ్య పదము తంజపురిపై పెట్టకమున్నే క్షేత్రయ్య పదములు అచ్చోట నాట్యరూపాన స్వైర విహారము చేస్తూ ఉండడము శ్రీశ్రీశ్రీ రఘునాథనాయకులు చిరునగవుతో గమనిస్తూ ఉండిరి. క్షేత్రయ్య పదముల బంగరు మువ్వలు గోపాలమూర్తి వేణుగానానికి సరిలయలను సమకూరుస్తూ ఉన్నవి. రసదేవత నదీమూర్తియై వేణుగోపాల మూర్తిని చేరుటకుగాను పరవళ్ళు త్రొక్కుతూ ఉండెను.
ప్రభువులు సంతోషాంతరంగికులై నాట్యమును తిలకిస్తూ ఉండిరి. ప్రాచేతనుడు వచ్చి, చంద్రగిరి నుండి వేగువచ్చిన వైనమును సైనికాధికారికి విన్నవించుకొని వెనుకకు రెండడుగులువైచి సవినయముగ నిలబడెను. ప్రభు కనుసన్నలను గ్రహించి సైన్యాధ్యక్షుడు చారుని తక్షణము ప్రవేశపెట్టుమని ఆజ్ఞాపించెను. ఆనాటికిక నాట్యసభ ముగిసినది.
అమాత్యులు వెంటరాగా శ్రీశ్రీశ్రీ రఘునాథ మహారాజులు అభ్యంతర మందిరానకు వడివడిగా వెడిలిరి. మరికొంత వడికి సైన్యాధ్యక్షులు మరి కొందరు ప్రముఖులు అచటికి చేరి ఉచితాసనములపై ఆశీనులైరి. ప్రభువులవారి మరసు అవ్యక్త వేదనకు లోనైయుండెను. విజయనగర సార్వభౌములైన ఇమ్మడి వేంకట భూపతిరాయలవారి స్వాస్థ్యమును గూర్చి అచట చేరిన వారికందరకు శంక కలిగినది.
చారుడు ప్రవేశించిన వెంటనే, రాయప్పా ! చక్రవర్తుల ఆరోగ్య మెట్లున్నది ? ప్రభువులవారు కుశలమా ? అని గోవిందామాత్యులు అత్రముగ ప్రశ్నించిరి. చారుడు తల దించుకొనినాడు. వాని మొగాన విషాద మేఘాలు ముసురుకొని ఉన్నవి. కనుల ఉండి జారువారిన నీటిబొట్లు ఉత్తరీయముపై బడినవి. గొంతు గద్గదమైనది. ప్రభూ, నేటికి రెండు దినముల క్రితము సార్వభౌములు వైకుంఠమునకు చేరిరి అనినాడు. |