130
 

యజ్ఞనారాయులు : మామయ్యగారూ ! శుక్ల యుజుర్వేదాలలో ఏది శ్రేష్టమండీ ?

అప్పయ్య : సరిపోయిందిరా, యజ్ఞాయ్యా ! ప్రాయికంగా ఇప్పడు నాకు యజ్ఞ యాగాదులంటేనే గిట్టటం లేదుకదా, ఇక ఈ రెండు భాగాలున్నూ యజ్ఞాల్ని ఎలా నిర్వహించాలో చెప్పేవే కదా.

యజ్ఞ : మనకు నచ్చడం సంగతి అలాగ ఉంచండి. ఏ శాస్త్రం దోష రహితంగా ఉన్నదో మీ అభిప్రాయాన్ని వినాలని ఉన్నదండి.

అప్పయ్య : ఏకరాత్రయాగం, అతిరాత్రయాగం, సర్వతోముఖ యాగం, పాయసయాగం, పులిహోర యాగం చేస్తూ నిత్యాగ్ని హోత్రాన్ని రగిలించే మా గోవింద యజ్వకన్న యాగాలను గురించి నేను ఏమి చెప్పేదిరా.

గోవింద : రఘునాథ మహారాజుల శిష్యుడై సాహిత్యాలంకారాది శాస్త్రాలను మధించినాడు. తరువాత, యజ్ఞయ్య వేద శాస్త్రావగాహనకు సిద్దపడినాడు. నాలుగువేదాల సారాన్నీ ముద్దకట్టించి తన శిష్యులకు గోరుముద్దలులా తినిపించాలని మా యజ్ఞనారాయణునకు కుతూహలంగా ఉన్నది.

అప్పయ్య దీక్షితుల నవ్వులు రాజగపాల స్వామివారి ఆలయాన భక్తులు మోగించే ఘంటారావాలతో మిళితమైపోయినవి. జానెడులేవు, నీకు కూడ శిష్యకూటమి ఏర్పడినదిరా ! అన్నాడు అచ్చెరువతో.

యజ్ఞనారాయణుడు సిగ్గుపడినాడు. మామయ్యగారూ, మా గురు దేవులైన మహారాజులవారున్నూ, పితృదేవులైన అమాత్యులవారున్నూ పట్టుబట్టి వేదపాఠశాలకు నన్ను కులపతిని చేసినారు. వారివురకూ నాశక్తి సామర్ధ్యములపై అపరిమిత నమ్మకమేగానా నాకు మాత్రము నేర్వవలసినది ఇంకనూ చాలా మిగిలి ఉన్నదనే భావంతో మీవంటి పెద్దలు వచ్చినప్పుడల్లా విషయ గ్రాహ్యం చేస్తూనే ఉన్నాను, అనినాడు.

అప్పయ్య : ఓరి ! ఓరి ! నాచిటికెన వ్రేలంతలేవు. నిన్న మొన్న కనులు తెరిచినవాడివి, అప్పుడే నీవు కులపతివై నావూ !! అయితే నేనొక చిన్న ప్రశ్న వేస్తాను. ప్రత్యుత్తరం ఎలా ఇస్తావో చూస్తాను.

యజ్ఞ : అడగండి, మామయ్యగారూ ! సమాధానం చెప్పగలనని ప్రతిన పూనలేనుగాని, ప్రయత్నం చేస్తాను.

అప్పయ్య : ఓహో ! వినయం బాగా నేర్పినాడు, మీ నాయన ! సరే, విను యాజ్ఞవల్క్యుడనే ఒక శిష్యుడు గురువుకు ఎదురు చెప్పాడల ! ఆ గురువు...

యజ్ఞ : వైశంపాయన మహర్షేకదా.

అప్పయ్య : అవును. వైశంపాయనులవారే. వారికి ఆగ్రహం వచ్చి శిష్యుణ్ణి కోపించి, తాను నేర్పిన విద్యనంతా కక్కమన్నారుట. శిష్యుడు కక్కేసిన విద్యని అక్కడ ఉన్న మునులంతా తిత్తిరి పక్షుల రూపాలతో వచ్చి, భక్షించి తిరిగి దానిని మరల మనకు మంత్రాలుగా బోధించారట...

యజ్ఞ : మీ ప్రశ్న నాకు అర్ధమైనదండి. మీరు తైత్తిరీయ సంహితను ప్రస్తావిస్తున్నారు.

గోవింద దీక్షితులవారికీ అప్పయ్య దీక్షితులవారికీ కర్మజ్ఞాన మార్గాలు ఎలా భేదిస్తూ ఉండెనో అలాగుననే యజుర్వేదంలో కూడా ఇరువురిదీ చెరొకశాఖ గోవిందామాత్యులకు కృష్ణయుజుర్వేదం పరమ ప్రమాణం. అప్పయ్య దీక్షితులకు శుక్ల యుజుర్వేదం శిరఃస్థానీయం. చిన్నతనాన గోవింద దీక్షితులను అప్పయ్య దీక్షితులవారీ విషయంలో హేళనచేస్తూ ఉండేవారు. పక్షుల ఉచ్ఛిష్టాన్ని ప్రమాణంగా స్వీకరించేకంటె శుక్లయజుర్వేదాన్ని అనుసరించమని చెప్పేవారు. కాలక్రమాన అప్పయ్య దీక్షితుల మార్గం జ్ఞానం వైపునకు మరలి, ఎన్ని వేదాలు చదివినా, ఎని యజ్ఞాలు చేసినా బ్రహ్మ జ్ఞానం లేనివారికి ప్రయోజనం శూన్యంగానే ఉంటుందని వాదించసాగినారు. నేడీ బాల వేదవిదుని చూచి ముచ్చటపడి కృష్ణ యజుర్వేద ప్రసక్తిని తెచ్చిరి.

యజ్ఞనారాయణుడు కనులు మూసికొని మూడుక్షణాలపాటు మౌనం వహించినాడు. మామయ్యగారూ ! యాజ్ఞవల్క్యుడు వాజసని పుత్రుడు. అతడు గొప్ప ప్రతిభావంతుడు. గురువు చెప్పిన విద్యలను మనోవేగంతో గ్రాహ్యం చేసికొనగలిగేవాడు. అయినప్పటికీ అతి స్వతంత్ర భావాలతో గురు తిరస్కారం చేసి గురుకోపానికు లోనైనాడు. ఇక గురువు శిష్యుని గ్రక్కమనడమూ, శిష్యుడు క్రక్కడమూ మునులు పక్షులు రూపానవచ్చి కక్కినదావిని భుజించడమూ ఈ విషయాలను మన పూర్వీకులు యదార్ధ విషయాన్ని ప్రతీకాత్మకంగా చెప్పి ఉంటారు లేదా అపార్ధం చేసుకుని ఉంటారు అనినాడు.