48
 

క‌ద‌లిరావ క‌న‌గ‌మ‌మ్ము !
అమ్మా పెరియ నాయ‌కీ !
జ‌న‌కుడైన హిమ‌న‌గేశు
మ‌న‌ములందు ఆడుకొంటు
ర‌జిత న‌గ‌ధీశుని కూతువై
రంజించిన ల‌లితాంగీ
అమ్మా పెరియ‌నాయ‌కీ !
ఎరుక‌సానియైన భ‌వుని
క‌ర‌ము చూసి ప్ర‌శ్న‌డిగితివి
ఉత్త‌రాన‌నుండి మ‌గ‌డు
బిత్త‌రి నీక‌గున‌న్న‌ది
అమ్మా పెరియ‌నాయ‌కీ !
ర‌త్న‌భూష‌ల‌న్నీ ఊడ్చి
ర‌మ‌ణి నార‌చీర గట్టి
త‌ప‌మొన‌ర్చినావు దేవి
త‌ల్ల‌డిల్లె విశ్వ‌మంత‌
అమ్మా పెరియ‌నాయ‌కీ !
త‌ప‌సు మెచ్చి విశ్వేశుడు
త‌ళుకుమంటు ఎదుట తోచె
వ‌ర‌మేమ‌న చిరున‌గ‌వుల‌
ప‌ర‌మేశుడె వ‌ర‌మంటివి
అమ్మా పెరియ‌నాయ‌కీ !
ఆకాశ‌మె పందిరిగా
ఆదిత్యులె కాగ‌డాలు
తార‌క‌లె తోర‌ణాలు
త‌ర‌లినారు దేవ‌త‌లూ
లోకేశుడు లోకేశ్వ‌రి
ఏక‌మ్మౌ పెండిల‌య్యో
అమ్మా పెరియ‌నాయ‌కీ !

ఈ ప‌దము అభిన‌యిస్తూ, చెంచుల‌క్ష్మి బృహ‌న్నాయ‌కి అయిన‌ది. బృహ‌దీశ్వ‌రుడైన‌ది, మాయ ఎరుక‌ల‌సాని అయిన‌ది. న‌డ‌క‌లో, దేహ‌ము క‌ద‌లిక‌లో, చేతుల విక్షేప‌ముల‌లో, హ‌స్త‌ముల ముద్ర‌లు ప‌ట్ట‌డ‌ములో ఆ బాలిక ఆ స‌భ‌ను ఆనంద మూర్ఛ‌లో ముంచిన‌ది. ర‌ఘునాధ నాయ‌కుడు అనిమేషుడై నాట్య‌ము తిల‌కించినాడు. ఆదిశేషువై ఆమె వాచ్యాభిన‌య‌మూచ కంఠ మాధుర్య‌మూ ఆస్వాదించినాడు.

శాస్త్ర‌ము త‌ప్ప‌క శాస్త్ర‌పాఠ‌ము ప‌ర‌మ సౌంద‌ర్య‌పూర్ణంగా చూపించ‌డంలో, భావ‌ము చ‌తుర్విధాభిన‌యాల క‌ళ‌ను మూర్తించ‌డ‌ములో ఆ ముగ్ద‌బాలిక ఈడు రాబోవు పూమొగ్గ‌లు తొడిగిన మ‌ల్లికాల‌త వ‌లె భాసించి పోయిన‌ది.

న‌వ‌రాగ‌మాలికా యుక్త తాన‌వ‌ర్ణ‌ము ప‌డుతూ, ఆది తాళాన కేదార‌గౌళ ఎత్తి, పానీసా...స‌ని స‌రి స‌స నిని స‌మ గ‌మ‌...ప‌నిస‌స మ‌మ గ‌గ‌..రిరిస‌ని ప‌నిస‌...మ‌గ‌మ స‌ని...ప‌స‌ని పామ‌.... మ‌గ‌రిసా...స‌నిప‌మ‌...గ‌...ని ప‌మ గ‌రి స‌ని

అని రాగ‌ప్రస్తారం గావిస్తూ నృత్త‌చంక్ర‌మ‌ణం స‌లిపి, సాహిత్య‌ము అభిన‌యించి నృత్తాలంక‌ర‌ణ‌ము ఫేర‌ణి చేసిన‌ది.

శుక‌వాణి కేదార నుండి శంక‌రాభ‌ర‌ణానికి వెళ్ళింది. క‌ళ్యాణ బేగ‌డ‌, కాంభోజి, య‌దుకుల కాంభోజి, బిల‌హ‌రి,మెహ‌న శ్రీ‌రాగాల‌లో తాన వ‌ర్ణ‌ము పూర్తిచేసి, ఆ బాలిక మంగ‌ళ‌ము పాడి నాట్య‌ము పూర్తి చేసిన‌ది.

స‌భికుల హ‌ర్ష‌ధ్వానాలు, పండితుల ఆశీర్వాదాలు మిన్ను ముట్టాడయి. శుక‌వాణి రంగ‌స్థ‌లం నుండి వ‌చ్చి, గురువుల‌కు సాష్టాంగ న‌మ‌స్కారం చేసింది. దివ్య‌కాంతులు ప్ర‌స‌రించే ఆ బ్ర‌హ్మ‌ర్షి శుక‌వాణిని క‌న్న కూతురు క‌న్న ఎక్కువ‌గా ప్రేమిస్తాడు. ప్రేమ‌న‌వ్వుల నుండి జోత్స్నాకాంతులు ప్ర‌స‌రిస్తూ ఉండ‌గా ఆ బాలిక‌ను లేవ‌నెత్తి గోవిందమ‌ఖి ఆమె త‌ల‌పై కుడి హ‌స్త‌ముంచి ఆశీర్వ‌దించినాడు. ఆ బాలిక ర‌ఘునాధ యువ‌రాజు క‌డ‌కుపోయి మోక‌రించిన‌ది. ఆ ప్ర‌భువు ఆ బాలిక‌ను దివ్యానంద సిద్ధిర‌స్తు ! క‌విత్వ ప్రాప్తిర‌స్తు ! అని ఆశీర్వ‌దిస్తూ, శుక‌వాణీ ! నాకీనాడు నువ్వు నీ సంగీత నాట్య ప్ర‌ద‌ర్శ‌నాల వల్ల చేకూర్చిన ఆనందం ఇంత‌వ‌ర‌కూ ఏనాడు నేను పొంద‌లేదు. నీ చిన్న‌వ‌య‌సు ఒక్క‌టే నీ విద్య‌ల ప‌ర‌మ ప‌రిణితికి అడ్డు వ‌చ్చిన లోటు ఇది మాత్ర‌మే నా బ‌హుమాన‌ము. అని ఆ యువరాజు బాలికకు త‌న‌రాయ‌స‌మందిచ్చు స్వ‌ర్ణ‌పేటిక తీసుకొని ఆ బాలిక హ‌స్తాన పెట్టినాడు.