49
 

ఆ బాలిక మోక‌రించే ఆ స్వ‌ర్ణ‌పేటిక అందుకొని క‌ళ్ళ‌కు అద్దుకొన్న‌ది. లేచి మీ నాట్య గురువుకు న‌మ‌స్క‌రించ‌మ్మా ! అని గోవిందమ‌ఖి చిరున‌వ్వు న‌వ్వుతూ ప‌లికినాడు.

ఆ బాలిక సిగ్గుప‌డుతూ పెట్టె చెలిక‌త్తె కందిచ్చి, త‌ను లేచి నాట్య గురువుకు త‌క్కిన పండితుల‌కు న‌మ‌స్క‌రించిన‌ది.

ర‌ఘునాథ ప్ర‌భువు అక్క‌డి నుండి నాట్య‌గురువున‌కు వెండి పళ్లెరాన వేయి నూట‌ప‌ద‌హారుట‌కాంలు బ‌హుమాన మిచ్చినాడు. మార్దంగి కున‌కూ, ముఖివీణియ వానికి, వైణికుల‌కు, నాద‌స్వ‌ర వాద్య‌కుల‌కు, తాళం వేసిన చెలిక‌త్తెకు నూట ప‌ద‌హారు టంకాలు చొప్పున బ‌హుమానాలిచ్చినారు. ఆ పండిత‌లోకానికి కాశ్మీర‌శాలువ‌ల జంటుల‌, నూట ప‌ద‌హారు టంకాల పార‌తోషికాలు అర్పించినాడా ప్ర‌భువు.

దేశికులు గోవింద దీక్షితుల‌క‌డ సెల‌వు పొంద ర‌ఘ‌నాధ నాయ‌కులు న‌మ‌స్క‌రించి, విప్రులు ఆశీర్వ‌దింప‌, త‌క్కుంగ‌ల‌వారు జ‌య‌ధ్వానాలు ప‌లుకుతూ న‌మ‌స్క‌రిస్తూ ఉండ‌గా, నూరు కాగ‌డాలు కూడిరా పైకివెళ్ళి, ర‌ధ‌మెక్కి త‌మ‌న‌గ‌రు చేరుకున్నారు.

ఆ రాత్రి వారి నిద్ర రామ‌భ‌ద్రాంబ న‌గ‌రిలో, ఆ యువరాణీ స్వ‌రాలంకార‌శోభిత‌యై, నాధుని కెదురువచ్చి, తానే స్వ‌యంగా భ‌ర్త‌పాదాలు పన్నీట క‌డిగి, నీరు శిర‌సున చ‌ల్లుకొని, మెత్త‌ని తుండుల‌తో త‌డి యొత్తిన‌ది.

రామ‌భ‌ద్రా ! మా మేన‌మామ‌గారు మూర్తెప్ప నాయ‌నిం వారికి చెంచుల‌క్ష్మి ప్రేమ త‌న‌య‌. ఆ బాలిక ప్ర‌తిభ అప్ర‌తి మాన‌ము, అని ర‌ఘునాథ నాయ‌కుడు రామ‌భ‌ద్రాంబ‌ను భుజ‌ములు ప‌ట్టి లేవ‌నెత్తి, ఆమె న‌డుము చూట్టు వామ హ‌స్త‌ము పోనిస్తూ కుడిచేత ఆమె మెము పైకెత్తి ఆమె క‌ళ్ళ లోకి చూస్తూ ప‌లికినాడు.

రామ‌భ‌ద్రాంబ చిరున‌వ్వు న‌వ్వుతూ, ప్రాణేశ్వ‌రుల హృద‌యం నాకర్థం కాలేద‌నా ? మీరు ద‌క్షిణ నాయ‌కులే ! అని అన్న‌ది.

నీకు ఓర్వ‌లేని త‌న‌మా దేవీ ! అంటూ ఆ బాల‌మోము మీద‌కివంగి త‌న మోము నానించి ప్ర‌శ్నించినాడు, ర‌ఘనాధుడు.

కాదండీ ! మీకు మేము స‌మానం కావ‌చ్చును. మాలో మాకు మాత్స‌ర్యాలు ఉంటాయి ! అని బంగ‌రు గంట మోగిన‌ట్లు న‌వ్వింది.

ఏ మాత్ర‌మూ క‌ల‌తలేని ఆమె మోమున తాండ‌వించు ప్ర‌ణ‌య‌కాంతులు ప‌రిశీలిస్తూ ర‌ఘునాధుడు, దేవీ ! ద‌క్షిణ నాయ‌క‌త్వ‌ము మ‌నుష్యుని నీర‌స‌త్వ‌ము. ఆలోప‌ము రాజుల‌లోనైన క్షంత‌వ్య‌ము కాదు. ద‌క్షిణ నాయ‌క‌త్వ ప్రాప్తికి అతని స్థితి ఒప్ప‌దు. కాని కొండ‌జాతి వాళ్ళు, కొంద‌రు ముష్టి జాతుల‌వాళ్ళు తాము చేసే ప‌నికోసం నలుగురైదుగురు భార్య‌ల‌ను క‌ట్టుకుంటార‌ట అంతేగాని సాధార‌ణ మ‌నుష్యులు అనేక కార‌ణాల‌వ‌ల్ల ఏక‌ప‌త్నీ వ్ర‌తులు, బ‌హుస్త్రీ వాంఛా దోషాన్ని రాజాశ్రితులైన క‌వులు ద‌క్షిణ నాయ‌క‌త్వంగా వ‌ర్ణిస్తారు, అని ఆలోచ‌నా పూర్ణ‌కంగా అన్నారు.

రామభ‌ద్రాంబ భ‌ర్త మెడ‌చుట్టూ చేతులు వైచి, ఆయ‌న మోమును మ‌హామ‌ధుర భావ‌దృష్టుల పూజ చేస్తూ, ఆత్మ‌నాధులీదినాన ఒక బాలిక మ‌హా విద్యా మ‌ధువును సేవించి ఆనంద‌మ‌త్తులై త‌ప‌త‌ప మాట‌లాడుతున్నారా ?

తాము పై తెలిపిన పానీయాలు కొల‌దిగా సేవించ‌వచ్చు క‌దా ప్ర‌భూ !

ఓసి కావ్య‌ర‌స మ‌ధుక‌ల‌శీ నోరూర‌, హృద‌య మార ఎట్ట ఎదుట ఆయా పానీయాలు ప్ర‌త్య‌క్ష‌మైతే, నేను అమ‌రుణ్ణి కాద‌ల‌చుకొన్నాను. కాబ‌ట్టి అన్నీ సేవించ‌ద‌లుచు కొన్నాను.

ర‌ఘునాథుడు రామ‌భ‌ద్రాంబ‌ను బిగియార కౌగిలించి, ఆమె అధ‌ర‌సుధార‌స పానానందుడ‌య్యాడు. రామ‌భ‌ద్ర ఆ ప‌ర‌మ శృంగార నాయ‌కుని కౌగిలిలో వివ‌శ‌యై క‌రిగి, మ‌త్తుగొని నాధుని మోవిని త‌న మోవికి ఇంకా గాఢంగా అదుముకొన్న‌ది.
ర‌ఘునాథుడు ప్రేమావేశంలో రామ‌భ‌ద్ర‌ను పూల‌పోవులా ఎత్తివేసి త‌న‌ హృద‌యానికి అదుముకునే ఆ ఏడు మ‌ల్లెపూట ఎత్తు బాలిక మోవిని త‌న‌వి తీర‌ని త‌మితో పూవును తుమ్మెద వ‌డ‌ల‌న‌ట్లు వ‌ద‌ల‌క గుమ్మాలు దాటి త‌మ శ‌య‌న మంద‌రింలోనికి కొనిపోయి అల‌కాపురిలా వెలిగిపోవు ఆ మందిర మ‌ద్య‌స్ధ‌దివ్య త‌ల్పంపై ప‌రుండ బెట్టి ఆమె పై సోలిపోయినాడు.

ప్ర‌భూ మీ బాహువుల‌లో జ‌యంత‌సేన రాగ‌మూ మీ హృద‌యాన రామానంద తాళ‌ములూ ధ్వ‌నిస్తూ ఉన్న‌వి. రామ‌భద్రా నేనీరాగ తాళ‌ములు మొన్న‌నే క‌నిపెట్టాను. అప్పుడే నీదాకా ఇవ్వి న‌డ‌చి వ‌చ్చినావా ? సంగీత సుధ ప్ర‌వ‌హిస్తూనే ఉంటుంది. ప్ర‌భూ ఒక‌చోట ఆప‌డం ఎవ‌రి త‌రం ! తెలతెల‌వారుతున్న సూచ‌న‌గా ప‌క్షులు కిల‌కిల‌రావ‌ములు మిన్ను ముట్టాయి.