71
 

నాయ‌నా, మ‌న కుప్ప‌న్న బ‌తికి బ‌ట్ట‌క‌ట్టేనా ? అన్న‌ది వేంక‌ట‌ప‌తి తల్లి.

అమ్మా మ‌న‌రాజు మంచి గురికాడేన‌ని నిరూపించుకొన్నాడు. ఇక రేపు పందెంలో గెల‌వ‌డ‌మే త‌రువాయి. అంతేనా రాజూ ?

ఏమో అన్న‌య్యా, పందెం పందెమే...గెలుపోట‌ములు ఎవ‌రు చెప్పొచ్చారు.

సూర‌మాంబ : మ‌నం కుప్ప‌న్న‌ని అర్నేల్ల‌లో క్షేమంగా తిరిగి పంపిస్తామ‌ని చెప్పి తీసుకొచ్చామా ! వాడి మామ‌కి మాట కూడా ఇచ్చామా, ఇప్పుడీ అఘూయిత్యం ఇలా జ‌రిగిందేమిటి, అని హ‌డ‌లి ఛ‌స్తున్నా న‌నుకో పెద్ద‌బ్బాయ్ !

వేంక‌ట‌ప‌తి తల్లి : అవున‌వును. వాడి పెళ్ళాం, పాపం మ‌న‌ల్ని తిట్టుకుంటూ హోరుమ‌ని ఏడుస్తూ కూర్చోవ‌ల్సిందే కాదా !

రంగి : అదేంట‌మ్మ గోరూ అంత యిదైపోతారు. అళ్ళ‌ల్లో మారు మ‌నువులున్నాయి గందా ! అంత‌గా అయితే రెన్నాల్లేడుత్తారు, నాల్ల్నాళ్లేడుత్తారు ఏడుత్తూ కుకుంటార‌నా ?

రంగి మాట‌ల‌కి వేంక‌ట‌ప‌తి రాజుకి అసహ్యం క‌లిగిన‌ది.

ఎవడి బ్ర‌తుకువాడిదే. పెళ్లాము కోసం బ్ర‌త‌క‌నూబ్ర‌త‌క‌డు, చావ‌నూ చావ‌డు. ఉన్న‌న్నాళ్ళూ సంతృప్తి కోసం అలా అనుకుంటారు, అంటూ వేంక‌ట‌ప‌తి త‌న శ‌య్య ద‌గ్గ‌ర‌కు వెళ్ళినాడు.

అత‌నికి ఈ ద‌క్షిణాది నాయ‌క‌రాజుల ఆచార‌మొక‌టి గుర్తుకువ‌చ్చి గుండె పిండిన‌ట్ల‌యింది. ఈ రాజుల‌లో బ‌హు భార్యాత్వం కూడా త‌ప్పుకాదు. ఒక్కోరాజు మ‌ర‌ణిస్తే అతడి మూడు, నాల్గు వంద‌ల మంది రాణులూ స‌హ‌గ‌మ‌నం చేస్తుర‌ట ! ఈ ఆచారాన్ని ఇక్క‌డి రాణులు మానుకోలేకుండా ఉన్నారు.
అంద‌రికీ మ‌ళ్ళీ కునుకు ప‌ట్టేస‌రికి తొలికోడి కూసింది. ఆకాశ‌పుటంచులు ఎఱ్ఱ‌ప‌డ‌సాగాయి. తూర్పు తీరాన శుక్ర‌న‌క్ష‌త్రం ఎఱ్ఱ‌చీర క‌ట్టుకొన్న ఉషోదేవి హృద‌యాన మ‌ణిహారంటా వెలిగిపోతోంది.

వేంక‌ట‌ప‌తి సారంగ‌ధ‌ర పూర్తి చేయుట‌కుగాను గ‌ణాధిప‌స్తోత్ర‌ము సూర్య స్తోత్ర‌ము చేసి క‌నులు మూసికొన్నాడు. సారంగ‌ధ‌రుని దీనాలాప‌ములు చెవుల‌కు సోకిన‌ట్ల‌యిన‌ది. ఈత‌నిని ఇటువంటి దీనావ‌స్థ‌లో పెట్టిన ఆ..పిన త‌ల్లిపై కోప‌ము క‌లిగిన‌ది. ఆ రాజును అన‌వ‌లె, త‌న కుమార్తె కీడైన ప‌డ‌తిని తాను పెండ్లి యాడుట దోష‌ము కాదా ? అందుచేత‌నే క‌దా తాను కొన్ని మార్పులు చేసిన‌ది ?

రాజ న‌రేంద్ర భూర‌మ‌ణుడు రాజ మ‌హేంద్రాన్ని ప్ర‌జారంజ‌కంగా ప‌రిపాలిస్తున్నాడు. ఆ ప్ర‌భువున‌కు ర‌త్నాంగియ‌ను దేవేరియును, చిత్రాంగి య‌ను భోగాంగ‌న‌యును ఉన్నారు. ఆ రాజున‌కు ర‌త్నాంగిప‌ట్ల గౌర‌వ‌మ‌ర్యాద‌లును అభిమాన‌మును, చిత్రాంగిప‌ట్ల ఎన‌లేని త‌మ‌క‌మును ప్రేమ లాల‌న‌యును మిక్కుట‌ముగా ఉన్న‌వి. అత‌నికి ధ‌న‌తృష్ణ‌, రాజ్య‌తృష్ణ‌లేవు గాని సంతాన‌తృష్ణ ప‌ట్ట‌రానంత‌గా ఉన్న‌ది. పెక్కు సంవ‌త్స‌ర‌ములు గ‌డ‌చిపోతున్న‌వి. రాజున‌కు మ‌ధ్య వ‌య‌స్సు కూడ మించిపోవు త‌రుణ‌మాస‌న్న‌మైన‌ది. రాజ‌పురోహితులు, ఆస్థాన పండితులు, భిష‌గ్వ‌రులు చేయ‌మ‌న్న గ్ర‌హోప‌శాంతులు, పూజ‌లు, వ్ర‌తాలు, ఔష‌ద‌సేవ‌లు, స‌మ‌స్త దానాలు చేసినప్ప‌టికిన్నీ పుత్రోద‌య భాగ్య‌మున‌కు నోచుకొన‌లేక పోయినాడు.

చ‌క్క‌లిగింత వెట్టిన‌ను సారె గికాకిక న‌వ్వుచున్ బ‌యిం
బ‌క్క‌బ‌డంగ జ‌క్క‌ని కుమారుని మ‌క్కువ మీర నేడ్పురా
జెక్కిలిగీటి యెత్తి యెద‌జేరిచి ముచ్చ‌ట దీరున‌ట్లుగా
నక్క‌ట ముద్దులాడ‌వ‌ల‌దా యిటువంటి భాగ్య‌మున్‌.

ప‌చ్చ‌ని తేనె ప‌న‌స తొన‌ల యొడ‌లితో మిస‌మిస‌లాడు బంగారు బొజ్జ‌నాయ‌న‌, చ‌క్క‌లిగింత పెట్టినా పెట్ట‌కున్నా బుగ్గ‌ల సొట్ట‌ప‌డేట‌ట్లు కిల‌కిల న‌వ్వే ఓ చిన్ని కిష్ట‌ప్ప అత‌ని క‌న్నుల‌కు గ‌ట్టిన‌ట్లు క‌న్పించి మురిపంచేవాడు. ఆ బాలుడు రువ్వే న‌వ్వుల పువ్వులు అంతఃపుర‌మంతా విరిసిపోతూ ఉంటే చేతులు జాపి ప‌ట్టురారాల‌లాగ మెత్త‌నైన ఆ వంశాకురాన్ని హృద‌యానికి హ‌త్తుకుని మురిసిపోయే దెన్న‌డో అని ర‌త్నాంగి క‌న్న కూడ‌తానే బెగ్గ‌టిల్లి పోయేవాడు, మ‌హారాజు.