70
 

అన్న‌మ‌రాజు క‌త్తిని ఝలిపించాడు. వేంక‌ట‌ప‌తి ఖ‌డ్గాన్ని త్రిప్పాడు. వారి భ‌యం ఒక్క‌టే, తాము వేసే వ్రేటు కుప్ప‌న్న‌కు త‌గులుతుందో ఎలుగుకు త‌గులుతుందో అని. అది వానిని అంత‌గా క‌మ్ముకుని క‌ప్పి వేసింది. అన్న‌య్యా, క‌త్తి త‌గిలితేకుప్ప‌న్న చ‌చ్చిపోతాడేమోన‌ని భ‌యం అక్క‌ర్లేదు. క‌త్తి దెబ్బ త‌గ‌ల‌క‌పోయినా అత‌డు చ‌నిపోయేది ఖాయ‌మే. చూడు ఇప్ప‌టికీ ఎలా నీర‌స‌ప‌డిపోతున్నాడో ! మ‌న అదృష్టం బాగుండి ఎలుగ‌కే త‌గిలిందా కుప్ప‌న్న బ్ర‌తికే అవ‌కాశం ఉంటుంది.

అన్న‌మ‌రాజు త‌న చేతిలో ఉన్న క‌త్తితో, క‌ళ్ళూ మూసుకుని ఒక దెబ్బ వేయ‌బోయాడు. వెంక‌ట‌ప‌తి హెచ్చ‌రించాడు, త‌మ్మూడూ, కుల‌దైవ‌స్మ‌ర‌ణం చేసుకో... జై ర‌ఘునాధ అంటూ ఒక్క వ్రేటు వేశాడు, అన్న‌మ‌రాజు. భ‌ల్లూకం త‌ల ఎగిరి అల్లంత‌దూరంలో ప‌డ్డ‌ది. కాని, దాని ప‌ట్టు అలాగే ఉంది. దానితోపాటు కుప్ప‌న్న కూడా కూలిపోయాడు.

అంద‌రూ కాగ‌డాలు తీసికొని అత‌ని ద‌గ్గ‌ర‌కు ప‌రుగులెత్తారు. ఆడ‌వారు గుండెలు అవిసిపోగా, ఏవో అవిసిపోగా, ఏవో క‌బుర్లు చెప్పుకుంటూ గుండె దిట‌వుచేసి కొంటున్నారు. చూశావా అక్కయ్యా, మ‌న బిడ్డ ఒక నిండు ప్రాణాన్ని ర‌క్షించాడు అని సంతోషంగా అన్న‌ది కురంగ‌న‌య‌న‌. అప్పుడే ఎక్క‌డ‌య్యింది, కుప్ప‌న్న బ్ర‌తికి బ‌య‌ట‌ప‌డ్డ‌డ‌ప్పుడు అనుకోవాలి ! వాడి ప్రాణం ఇందాకే పొయిందేమోన‌మ్మా అన్నాడు బండి సీత‌న్న‌, అన్న‌ది సూర‌మాంబ‌. ఇద్ద‌రూ కుప్ప‌న్న ప‌డ్డ‌చోటుకు వెళ్ళారు. పిల్ల‌లు వద్ద‌న్నా వెంట‌ప‌డ్డారు, ఎలుగును చూడ్డానికి.

గంగ‌య్య కుప్ప‌న్న క‌ట్టిన దుస్తుల‌ను వ‌దులుచేసి గుండెల‌పై అర‌చేతితో నెమ్మ‌దిగా రుద్దుతున్నాడు. వేంక‌ట‌ప‌తి క్ష‌ణంలో త‌న ఔష‌ధాల పెట్టె తెర‌చి ఒక చిన్న చెక్క‌సీసాలో ఉన్న ద్ర‌వాన్ని ప‌మిడిప‌త్తితో త‌డిపి ముక్క‌లో పిండాడు. నాడిచూచాడు బాగా బ‌లహీనంగా కొట్టుకుంటూంది. నాభిద‌గ్గ‌ర చేయిపెట్టి చూచాడు.
త‌మ్ముడూ, కుప్ప‌న్న‌కేం భ‌యంలేదు. ప్ర‌స్తుతం వాడు భ‌యం వ‌ల్ల‌నూ, ఒత్తిడివ‌ల్ల‌నూ మూర్ఛ‌పోయాడు. ఒక ప‌ది క్ష‌ణాల‌లో లేచి కూర్చుంటాడు ఒక ప్రాణాన్ని కాపాడిన కీర్తి నీకు త‌ప్ప‌కుండా ద‌క్కుతుంది. కుప్ప‌న్న జీవించినంత కాలం నీ పేరు చెప్పుకోందే నిద్ర మంచం మీద‌నుండి లేవ‌డు అన్నాడు వేంక‌ట‌రాజు.

గంగ‌య్య‌, సీత‌న్న‌, సోమ‌ప్ప మీరుముగ్గురూ ఈ రాత్రి మేల్కొన వ‌ల‌సిన‌వారు.

కుప్ప‌న్న‌ని ఒక్క‌ణ్నే మంట‌దగ్గ‌రుంచి మీరు నిద్ర‌పోయారా ? అని కోపంగా ప్ర‌శ్నించాడు, అన్న‌మ‌రాజు. వారు బ‌దులు చెప్ప‌క త‌ల‌లు వంచుకొని నిల‌బ‌డిపోయారు. పోనీ గంగ‌న్న వ‌య‌సుమీరిన‌వాడు. మీరిద్ద‌రు ఏం చేస్తున్న‌ట్లు ? అని తిరిగి వాడిగా అన్నాడు.

గంగ‌న్న వేంక‌ట‌ప‌తి ఇచ్చిన తైలాన్ని కుప్ప‌న్న మెడ‌కూ, కాళ్ళ‌కూ, చేతుల‌కూ రుద్దుతున్నాడు. సోమ‌న్న అత‌ని అరికాళ్ళ‌కూ చేతుల‌కూ ప‌సుపు రుద్దుతున్నాడు. సీత‌న్న అత‌ని గాయాల‌కి చూర్ణ‌ము అద్దుతున్నాడు. నాడీ వేగ‌ము హెచ్చింది. వేంక‌ట‌ప‌తి అత‌ని ముక్కులో మ‌ర‌లా రెండుచుక్క‌లు పోసి, త‌మ్ముడిని దూరంగా తీసికొనిపోయాడు.

కొద్దిగా వేడివేడిగా గంజిని సిద్ధం చేయ‌మ‌ని సోమ‌న్న‌తో చెప్పాడు, గంగ‌న్న‌. అర‌ఘ‌డియ ఉప‌చారం చేసిన త‌రువాత, కుప్ప‌న్న ఎల‌క‌పిల్ల‌లాగ భ‌యం భ‌యంగా క‌ళ్ళు మిట‌క‌రించి చూశాడు.

సీత‌న్న : ఒరే కుప్ప‌న్నా, అన్న‌మ‌య్య గోరికి దండ‌మెట్టుకోరా !

గంగ‌న్న : సీతిగా ! నీకు బుద్దున్నాదిరా ? ఓ ప‌క్క ఆడు భ‌యంతో పానాలు క‌డ‌ట్టి గుడ్లు మిట‌క‌రిత్తా ఉంటే, ఆరికి దండ‌మెట్టు, ఈరికి మొక్కులెట్టు అంటావేటిరా ? స‌న్నాసియెద‌వా ! పోయి సోమ‌న్న‌న‌డిగి గెంజి బేగితే, పో ! గెంజి స‌ల్లార్చి ఓ ఉప్పుగ‌ల్లే సుకురావ‌డం మ‌ర్సిపోకు. ల‌గెత్తుకురారా, కుర్రెద‌వా...! ఒరే కుప్ప‌న్నా ! నీ కొచ్చిన బ‌యం నేదు. మ‌న దొర‌కొడుకులిద్ద‌రూ మారాజులే పెద్దాయ‌న ఎంక‌ట్రాజు దొర ఎల‌క‌పిల్ల‌కి గోరు గోసుకుపోతే గిజ‌గిజ‌లాడిపోయేంత మెత్త‌నాయ‌న‌. మ‌న చిన్న‌య్య అన్నంరాజు దొర ఈ మ‌ద్దెన విద్దం అంటే మా మోజై పోనాది. పెద్ద ఈరుడై పోనాడు !

గంగ‌న్న కుప్ప‌న్న కాలూ చెయ్యీ మ‌ర్దించ‌సాగాడు. కుప్ప‌న్న లేచాడంటూ ప‌రుగున రాబోయారంద‌రూ. అంద‌ర్నీ చేసంజ్ఞ‌తో పంపించేశాడు, గంగ‌న్న‌. సీత‌న్న మెల్ల‌గా వెచ్చ‌వెచ్చ‌ని గంజి ఒక్కొక్క చుక్క కుప్ప‌న్న గొంతులో పోస్తున్నాడు. ఆడ‌స‌లే అడ‌లి సస్తున్నాడు. మీరెల్లి ఎలా ఉండి ఎలా ఉండి అన‌డ‌క్కండి. ఎలుగెలా ఒచ్చంద‌ని అడ‌క్కండి. ఆడా సంగ‌తి ఇంటే మ‌రింత బ‌య‌ప‌డి పిచ్చోడై పోగ‌ల్డు. ఆ మాటా ఈ మాటా ఏది వోగినా ప‌ర్లేదు. ఎలుగ్గొడ్డు ఊసెత్తితే మ‌క్కెలేరేత్తా అని ఆత్రంగా చూస్తున్న వాళ్ళ‌కు చెప్పి పంపించాడు.