69
 

ఓయీ, వెర్రి వెంక‌ట‌ప‌తీ ! కృష్ణ‌దేవ‌రాయ‌ల మాట ఏమి చేసినావు ? వారి ఆస్థానంలో ఉన్న అష్ట‌దిగ్గ‌జాల మాట ఏమి చేసినావు ? రాజే క‌వియైనప్పుడు కాస్సేపు రాజ్య‌సింహాస‌నంపైనా కాస్సేపు ఆస్థాన‌క‌వి స్థానంలోనూ ఆశీనుడౌతూ మ‌రియొక క‌విని కాలు పెట్ట‌నీయ‌కుండా ఉంటాడ‌నేనా నీ భావ‌ము ?

నీవు చెప్పిన త‌రువాత నాకు తంజ‌పురికే వెళ్ళ‌వ‌లెనన్న కోరిక మ‌రింత గాఢ‌మైపోయిన‌ది. కావి ఏదో ఒక భావ‌ము న‌న్ను ముందుకు పోనీయ‌డం లేదు.

నిన్ను నీవు కొంచ‌ప‌రుచుకోకు, మిత్ర‌మా ! తంజ‌పురిలో నీకు లోట‌న్న‌ది లేకుండ‌గ నేను చూస్తాను. విద్వానేవ నిజానాతి విద్వ‌జ్ఞ‌న ప‌రిశ్ర‌మం !

అశ్వ‌ము నెక్కి క్ష‌ణ‌ములో అర‌క్రోసెడు దూరం పోయినాడు, సైనికుడు.

నిజ‌ము క‌విత్వ‌మంటే తెలియ‌ని రాజుల‌ను ఏవో అర్ధంలేని అలంకారాల‌తో ప్రౌఢిమ‌లేని కావ్యాల‌తో రంజింప‌చేయ‌డం కంటే స్వ‌య‌ముగా విద్వాంసుడై ఉండి మ‌రియొక విద్వాంసుని ప్ర‌తిభ‌ను గుర్తించే క‌వి రాజును మెప్పించ‌డ‌మే క‌ష్ట‌ము. అట్టి ర‌ఘునాధుని చేత నేను భ‌ళీ అనిపంచుకుంటాను. ఇదే నా నిర్ణ‌య‌ము.

రాజూ ! రేప‌టితో మ‌న‌ము కావ్య‌ము పూర్తిచేసి మ‌రీ ఇక్క‌డి నుండి క‌దులుదాము.

ఈ సైనికుని అమాత్యులు నిశాచ‌రుడ‌ని అంటారుట‌. నిజ‌ముగా ఈత‌నికీ రాత్రి సంచార‌లేమిటో ?

చాలా బాగుంది అన్న‌య్యా ! మ‌న‌ము తంజ‌పురికేక‌దూ వేడుతున్న‌ది ? ఇక్క‌డ నుండి రెండునాళ్ళ ప్ర‌యాణ‌ము

ఇక ప‌డుకోవ‌య్యా రేపంతా ర‌చ‌నావ్యాసంగ‌మే. నిన్ను ఊపిరి తిప్పుకోనియ్య కుండా చేసాను చూడు నీ వ్రేళ్ళు వ్రాసి వ్రాసి పోటు పెట్ట‌వ‌ల‌సిన‌దే !

అన్న‌య్యా చూస్తాను. నేను ముందు వ్రాస్తానో నువ్వు ముందు చెప్తావో పందెమా ఝ‌

సరే., మ‌రి పందెము కోసం ప‌ణ‌మేమిటో ?

నేను ఓడితినా నా కేశ‌ముల‌ను తిరువ‌య్యూరులోనున్న సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి క‌ర్పించి గోష్ప‌ద‌శిఖ‌తో వేద‌మంత్రాల‌ను వ‌ల్లిస్తాను. మ‌రి గెలిచిన‌ట్ల‌యితే, నీతో పాటు నేనుకూడ క్షాత్ర‌ధ‌ర్మాన్ని అనుస‌రించాల్సి వ‌స్తుంది. స‌రేనా ?

స‌రే ! స‌రే !

నాటికి మాటాడ‌కుండ ఇరువుఊ నిద్ర‌కుప‌క్ర‌మించినారు. ఇరువుర‌కూ ఒకే ఆలోచ‌న‌.

అన్న‌య్య ఉత్సాహంగా ఉన్నాడు. ఉత్సాహంగా ఉన్న‌పుడు నేనాత‌ని మొర‌వ‌డికి త‌ట్టుకోలేను. నేను ఓడిపోతానేమో ! అన్న‌ది అన్న‌మ‌రాజు బాధ‌. రాజు మంచి వ్రాయ‌స‌కాడు. ఆట‌కోటి త‌న‌ముతో అటూ ఇటూ చూస్తూ ఉంటే త‌ప్ప ప‌ట్టుద‌ల‌గా వ్రాయ‌ల‌నుకుంటే అతి వేగంగా వ్రాస్తాడు. నేనే ఓడిపోతానేమో ! అన్న‌ది వేంక‌ట‌ప‌తి భావ‌న‌. ఇద్ద‌రూ దైవ‌ముమీద‌నే భార‌ము వేసిరి. కాని ఇద్ద‌రిలో ఓటమివ‌ల్ల ఎక్కువ బాధ‌ప‌డేది అన్న‌మ‌రాజే. అత‌నికి సైన్య‌లో చేరి యుద్ధాల‌లో పాల్గొనాల‌నే కాంక్ష క్ష‌ణ‌క్ష‌ణ‌మూ పెరిగిపోతున్న‌ది.

రాత్రి రెండుజాముల‌వేళ‌, మంట‌ద‌గ్గ‌ర కుప్ప‌న్న ఒక్క‌డే ఉన్నాడు. వెనుక‌గా ఒక భ‌ల్లూకం వ‌చ్చింది. కుప్ప‌న్న చూడ‌లేదు. మెత్త‌గా అత‌ని మీద ఏదో త‌గిలింది. వెనుక‌కు తిర‌గ‌బోతుండ‌గా అది వాని మెడ‌ను బిగించ ప్రారంభిందచింది. కుప్ప‌న్న ఒక్క‌బిగిని గుభుకుమ‌ని లేచేస‌రికి దాని ప‌ట్టు స‌డ‌లిపోయింది. అత‌డు ప‌డికిటితో దాని డొక్క‌లో పొడిచినాడు. ఈ సారి దాని ప‌ట్టు కుప్ప‌న్న న‌డుముదగ్గ‌ర ప‌ట్టాల‌ని చూస్తోంది. అప్ప‌టికి గాని తాను ఎంత ప్ర‌మాదంలో ఉన్నాడో ఎరుగ‌లేక‌పోయిడ‌త‌డు. భ‌యంతో నాలుక పిడ‌చ క‌ట్టుకుపోయింది. కేక‌లు వేయ‌సాగాడు. ఆ క్ష‌ణాన అత‌నికి ఒక్క‌రిపేరూ గుర్తుకురాలేదు. అ ! ఊ ! అమ్మో ! క్రీ ! అని పిచ్చిగా అర‌వ‌సాగాడు. గాఢ‌నిద్ర‌లో ఉన్న అంద‌రూ ఒక్క‌మారుగా లేచారు. క్రిందామీదా ప‌డుతూన్న కుప్ప‌న్నా ఎలుగుగొడ్డూ చెట్ల‌చాటున క్రీనీడ‌లో మ‌స‌క‌మ‌స‌క‌గా క‌నిపించారు. పిల్ల‌లు ఎలుగుగొడ్డు, ఎలుగుబంటు అంటూ చ‌ప్ప‌ట్లు కొడుతున్నారు. అయ్యో, కుప్ప‌న్న చ‌చ్చిపోతున్నాడు ! ఇది సంతోషించ‌వ‌ల‌సిన స‌మ‌యంకాదు అని వారి త‌ల్లి వారిని వారించిన‌ది. అప్ప‌టికే అది అత‌న్ని నాలుగుబార‌ల దూరం ఈడ్చుకుపోయింది. గొంతు బిగుసుకపోతున్న‌ది. మృత్యువుతో పెనుగులాడుతూనే ఉన్నాడు. రెండు క్ష‌ణాలు అలాగే ఉంటే ఇక కుప్ప‌న్న ఉండ‌డు.