82
 

ఇక‌నామెకు కాలోక‌చోట నిల‌వ‌లేదు. నెమళ్ళు పురివిప్పి ఆడుతూ ఉంటే చూసి ముచ్చ‌ట‌ప‌డింది. వాటి అడుగుల‌ను అనుక‌రిస్తూ తానూ నాట్య మాడింది. కృష్ణ‌హ‌రిణాలు ప‌రిగెడుతూ ఉంటే క‌నులు విచ్చుకొని చూసింది. పాట‌లు పాడుకొన్న‌ది. తీయ‌ని సెల‌యేటి నీటిలో ఈదులాడే హంస‌బాల‌లా ఆమె హృద‌య‌ము దేనికొర‌కో తొంద‌ర‌ప‌డిపోయిన‌ది. పికిలి పిట్ట‌వ‌లె విహాయ‌స ప‌ధాన ఎగిరిపోయిన‌ది. మ‌ర‌ల ఆటూ ఇటూ సంచ‌రించి, అచ్యుత ర‌ఘునాథుడు అల‌రించెను విన‌వే అన్న గీత‌ము పై మ‌న‌స్సు కేంద్రీక‌రించ‌గా ఆ పాటే తిరిగి తిరిగి హృద‌య‌చ‌క్రంలో ప‌రిభ్ర‌మించ‌సాగిన‌ది. అమ్మా, ర‌ధ‌ము వ‌చ్చింది సేవ‌కుని మాట‌లు విని మారు మాటాడ‌క వెళ్ళి, ర‌ధ‌మారోహించి, గృహాన‌కు వెడ‌లిపోయిన‌ది, శుక‌వాణి

నాటినుండి శుక‌వాణికి ర‌ఘునాథుల చ‌తురాక్ష‌రీ జ‌ప‌ము చేయ‌డానికి సూర్యోద‌య సూర్యాస్త‌మ‌య ప‌ర్యంత‌మైన మ‌ధ్య‌కాల‌ము స‌రిపోవుట‌లేదు. ర‌ఘునాథ నాయ‌కుడు ఆమె హృద‌య ప‌ద్మ‌రాగోద‌య‌కార‌కుడైన భానుమూర్తియైనాడు. సంత‌త దివ్య‌భావ‌న‌ల‌ను రేకెత్తిస్తూ ఆహ్లాద‌క‌రుడైన అమృత‌మూర్తియైనాడు. ఆమె త‌న ప్ర‌తి భావ‌న‌కీ అక్ష‌ర‌రూప‌మిస్తోంది. స్వ‌ర‌క‌ల్ప‌న చేస్తోంది. సంస్కృత ప్రాకృతాంధ్ర‌భాష‌ల‌లో ర‌ఘునాథుని కీర్తిస్తూ అనేక‌మైన ఖండ కావ్యాల‌ను అల్లిన‌ది. వీణావాద‌నంలో కొత్త మెళుకువ‌లు కొంగొత్త మూర్ఛ‌న‌లు వాటంత‌ట‌వే గంగా ప్ర‌వాహంలా విరుచుకు ప‌డుతున్నాయి. వేళ‌కు త‌ల్లి పిలిచి పెడితే భోజ‌న‌ము చేస్తుంది. ఏ కార‌ణం చేత‌నైనా ఆమె పిలువ‌క‌పోయెనా, ఇక ఆనాటికంతే ! ఆక‌లిద‌ప్పులు లేవు. నిద్రా విశ్రాంతులు లేవు.

ఇదేమి స్థితి ? ఈ నా గారాల బిడ్డ ఏమి కాబోతున్న‌ది ? ఇంత ఉత్కృష్ట ప్రేమ ఎక్క‌డైనా క‌ద్దా? ఊహించ‌ను కూడా క‌ష్ట‌మే ! ఇది ఉన్మాద స్థితి కీడ్చుకొని పోదుక‌దా ! మూర్తెప్ప నాయ‌నింవారు మేన‌ల్లుని పాదముల పై బ‌డి యైన‌నూ పుత్రికా భిక్ష పెట్ట‌మ‌ని బుజ్జిబుజ్జిమాట‌లు నేర్చుకో ? చూడు, ఈ మాట తేలికే, ర‌ఘునాథ అను ర‌....ఘ‌...నా.....ధా.....అని కొస‌రి కొస‌రి నేర్పిన‌ది. మైనాకు ర‌ఘు అని ప‌ల‌క‌డం రాలేదు. నాధా, నాధా అని ప‌లికింది. శుక‌వాణి సిగ్గుప‌డి న‌వ్వుకున్న‌ది. అమ్మో ! ఈ మాట ఎవ‌రిదగ్గ‌రా అన‌కు సుమా, ప‌రువు పోతుంది ! నువ్వు ఎప్పుడూ ప‌లికే రామా ! రామా ! అనే మాటే అనుకో.

కోరుకొన‌ద‌ల‌చుకొన్నారు. పేరిశాస్త్రుల వారిని పిలిచి అచ్యుత నాయ‌నింవారి యంతఃపురమున‌కు వెళ్ళి, పిల్ల‌నిత్తుమ‌ని చెప్పుట‌కు శుభ‌ల‌గ్న‌మును పెట్టించ‌ద‌ల‌చినారు.

రాచ‌న‌గ‌రు నుండి మూర్తెప్ప నాయ‌నివారి కాహ్వాన‌ము వ‌చ్చిన‌ది. క‌ళా స‌ర‌స్వ‌తీ విహార భూమిక‌గా రూప‌క‌ల్ప‌న చేయ‌బ‌డిన ఇందిరా మందిర భ‌వ‌న ప్ర‌వేశ‌మున‌కు, నాటికి మ‌రిమూడు దినాల‌కు వ‌చ్చు మార్గ‌శిర త్ర‌యోద‌శీ భృగువాస‌ర ఆభిజిల్ల‌గ్నాన వేద‌విదుల‌చే శుభ‌ముహూర్త‌ముగా నిర్ణ‌యింప‌బ‌డిన‌ది.

శుక‌వాణికి య‌జ్ఞ నారాయ‌ణుడు ప్ర‌త్యేకాహ్వాన ప‌త్ర‌మును తీసికొని వ‌చ్చినాడు. కాశ్మీర పుష్ప‌వ‌ర్ణ క్రొంబ‌ట్టు వ‌లిప‌ముపై సువ‌ర్ణాక్ష‌ర‌ల‌తో శ్రీ‌శ్రీ ర‌ఘునాథ యువ‌రాజుల‌వారి స్వ‌హస్త లిఖిత‌మైన దానిని చ‌దువు కొన్న‌ది, శుక‌వాణి. నీవు త‌ప్ప‌క రావాల‌ని యువ‌ప్ర‌భువుల ప్ర‌త్యేకాంక్ష‌గా తెలియ‌జేయ‌డానికై నన్ను పంపించినారు. అని చెప్పినాడు, య‌జ్ఞ‌నారాయ‌ణుడు. శుక‌వాణి కొడ‌లు తెలియ‌లేదు. ఆనంద‌మున‌కు ప‌ట్ట‌ప‌గ్గాలు లేకుండ‌పోయిన‌వి. అడుగులు భూమి పైనున్నా హృద‌యమంద‌రాని ఎత్తున‌కు పోయి, పైపైన సంచ‌రించ‌సాగిన‌ది. య‌జ్ఞ‌నారాయ‌ణునికి గంధ‌పుష్పాక్ష‌త‌ల‌ను, చంద‌నాగ‌రు క‌స్తూరి కాది పరిమ‌ళ ద్ర‌వ్య‌ముల‌ను, మ‌ధుర‌స భ‌రిత‌మైన దివ్య ఫ‌ల‌ముల‌ను అర్పించి త‌న మ‌హా సంతోషాన్ని తెలియ‌జేసిన‌ది.

ముహూర్త‌మున‌కు అర‌ఘ‌డియ‌కు ముందే ముత్యాల‌ప‌ల్ల‌కి వ‌చ్చి మూర్తెప్ప నాయ‌కుల గృహ ప్రాంగ‌ణాన‌నిల‌చిన‌ది. మ‌ర‌క‌త‌వ‌ల్లి ఇందే దైన ర‌హ‌స్య భావ‌మున్నాదా ? అన్న శంక క‌ల్గిన‌ది. చెంచుల‌క్ష్మి చిన్న పిల్ల‌. ఆమె కొఱ‌కు ప్ర‌త్యేకాహ్వాన‌మేమి ? ఈ ఆహ్వానం బ్రాహ్మ‌ణ కుమారునితో పంపుట ఏమి ? రాజ‌కుమారులు స్వ‌యంగా పిలువ‌నంపుటేమి ? విచిత్రంగా ఉంది కాదూ ! అనుకొన్న‌ది ఈ మాట‌లు త‌న సోద‌రి శృంగార వ‌ల్లితోనూ, భ‌ర్త‌తోనూ ఎన్నోమారులు అన్న‌ది. కాని ఎవ‌రికి వారే ఇట్లు కావ‌చ్చున‌ని అనుకొని పైకి ప‌లుక‌లేదు. ఇది రాజుల‌కు సంబంధించిన విష‌యం. ఏమి అంటే ఏమి ముంచుకువ‌స్తుందో తెలియ‌దు, అని అనుకున్నారంద‌రు.