87
 

ఒక గోపుర‌ము నుండి చూచిన శ్రీ‌రంగ ప‌ట్ట‌ణ‌మున వేంచేసియున్న శ్రీ మ‌హావిష్ణ‌మూర్తి శ‌య‌న‌రూప‌ముతోనున్న శేష‌శాయి యొక్క దేవాల‌య ప్రాకార‌ము ద్యోత‌క‌మ‌వుతుంది. అచ్యుత మ‌హారాజు ఈ గోపుర ద‌ర్శ‌న‌ము చేసికొంటేగాని భోజ‌న‌మును ముట్ట‌కొన‌రు. ఈ గోపుర‌ము యొక్క అంతర్భాగ‌మంతా శ్రీ‌ వైకుంఠ‌ము లాగానో, కైలాశేశ్వ‌ర‌ములాగానో ప‌విత్రా ల‌య‌మువ‌లె నుండి భ‌క్తి భావ ప్రేరిత‌ముగా, హృద‌యానంద‌క‌ర‌ముగా ఉంటుంది. శైవ‌వైష్ణ‌వ లీలా విగ్ర‌హాల‌తో భ‌క్తిర‌స‌ము వెల్లివిరుస్తూ ఉంటుంది. దేవ‌తార్చ‌న‌కు కావ‌ల‌సిన ఫ‌ల‌పుష్ప‌కుంకుమాదుల‌తో. తైల‌వ‌ర్ణ చిత్రాల‌తో, నాట్యభంగిమ‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడిపోతూ ఉంటుంది.

రెండ‌వ గోపుర‌ము ద్వారా దూర‌ము నుండి శ‌త్రువుల ఆగ‌మ‌న‌మును తెలిసికొన‌వ‌చ్చును. ఇందు మ‌హాగోప్య‌ముగా క‌త్తులు, క‌ళ‌త్త‌ములు, కఠారులు, ఖ‌డ్గ‌ములు, అగ్నిగుండ్లు, శ‌త‌ఘ్న‌లు, తుపాకులు, ఇనుప‌గుండ్లు వంటి కొండార‌ళ్ళు మొద‌లైన శ‌త్రుమార‌ణాయుధాలు భ‌ద్ర‌ప‌ర్చ‌బ‌డి ఉన్న‌వి. ఈ గోపురాన్ని ప్ర‌తిదిన‌మూ చూచేవారికి కూడ వీటి ప్ర‌స‌క్తి తెలియ‌దు. పైకి చూచుట‌కు అంతా చిత్ర‌మ‌య‌క‌ళా ప్ర‌పంచ‌ము. దేశ‌మంతా విరోధుల వ‌శ‌మైన‌ప్ప‌టికీ, రాజ‌వంశీయులు ఈ గోపుర‌మున నిల‌చి సంవ‌త్స‌ర‌ము పాటు క్షేమ‌ముగా ఆత్మ‌ర‌క్ష‌ణ చేసికొన‌డానికి స‌రిప‌డిన ఆయుధ సంప‌త్తిని., ఆహార సంప‌త్తిని ఇచ‌ట ప‌ర‌మ‌ర‌హ‌స్య‌ముగా నిక్షిప్త‌ము చేసినారు, యువ‌రాజులు.ఈ సౌధాన పొద‌గ‌బ‌డిన ఇంద్ర‌నీల మ‌ణుల‌కాంతులు సాక్షాద్రామ సామీప్యాన్ని అనుభ‌వింప‌జేస్తూ ఉంటాయి.

అంతఃపురానికి అర‌క్రోసెడు దూర‌ములోనున్న కోనె వాకిలిలో నిర్మాణ‌మైన ల‌క్ష్మీ విలాస‌భ‌వ‌నంలో పాలసంద్రాన్ని కాల‌ద‌న్ని వ‌చ్చిన ల‌చ్చిత‌ల్లి ఇచ్చ‌ట కాపురం చేస్తూన్న‌ట్లుగా స‌మ‌స్త సిరులూ విల‌సిల్లుతున్నాయి. ర‌ఘునాథుడు శ‌త్రురాజుల‌ను జ‌యించిన కీర్తిక‌న్య‌లా అన్న‌ట్లు, స్తంభ‌ముల‌పై చెక్క‌బ‌డిన మ‌ణిపుత్రిక‌లు, శోభాయ‌మానంగా కళ‌క‌ళ‌లాడి పోతున్న‌వి. శ‌త్రురాజుల కిరీటాల నుండి రాలిన న‌వ‌ర‌త్నాల‌తో విజ‌య తోర‌ణాల‌ను క‌ట్టిన శిల్ప‌క‌ళాకారుల ప్ర‌తిభ‌ను మెచ్చ‌డానికి ఆదిశేషుడికైనా మాట‌లు చాల‌వు.

లాగుల చ‌ప్ప‌ర‌ము వివిధ‌ములైన శ‌రీర విద్య‌ల‌శ‌క్తి సామ‌ర్ధ్య ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు అనువైన మ‌హామండ‌ప‌ముల‌తో విరాజిల్లే విశాల‌ప్రాంగ‌ణ‌ము. ముష్టి యుద్ధ‌ము, మ‌ల్ల‌యుద్ధ‌ము, బాహుయుద్ధ‌ము, కేశియుద్ధ‌ము, బాణ యుద్ధ‌ము, అస్త్ర యుధ్ధ‌ము, ధ‌నుర్యుధ్ధ‌ము, ఖ‌డ్గ‌యుద్ధ‌ము, క‌ర‌యుద్ధ‌ము మొద‌లైన యుద్ధ‌విద్య‌ల‌లో స్ప‌ర్ధ‌ల‌ను పెంచి, విజ‌యంపొందిన వారికేగాక ప్రావీణ్య‌నును ప్ర‌ద‌ర్శించిన వారికికూడ స‌ముచిత‌మైన కానుక‌ల‌నిచ్చి, ప్రోత్స‌హించ‌డ‌మూ, సైన్య‌మున వారికి అర్హ‌మైన కొలువుల‌నీయ‌డ‌మూ, బిరుదుల‌నీయ‌డ‌మూ, గ్రామాది శాశ్వత‌దాన‌ముల నీయ‌డ‌మూ ఇక్క‌డి ప్ర‌త్యేక‌త !

ప్ర‌తి సంవ‌త్స‌ర‌ము వేయిమంది మెరిక‌ల‌వంటి యువ‌వీరుల‌ను అన్ని రంగ‌ముల నుండీ ప‌రీక్షించి, నిగ్గుతేల్చి, నైపుణ్య‌ముగ‌ల‌వారిని లాగుల చ‌ప్ప‌ర‌ము నుండి సేనాద‌ళ‌ములోనికి తీసుకొంటూ ఉంటారు. క్ర‌మ‌శః ఉత్తీర్ణులైన‌వారే ద‌ళాధిప‌తులూ, సేనాధిప‌తులూ, తోపే భానాలూ ద‌ళ‌వాయిలూ అవుతూ ఉంటారు.

అచ్యుత‌రంగ కూట‌ము అంతఃపుర పుర ర‌మ‌ణీమ‌ణుల‌కు ప్ర‌త్యేకించి నిర్మింప‌బ‌డిన‌ది. కొన్ని ముఖ్య‌దినాల‌లో పుర‌ములోని పురంద్రీమ‌ణుల‌కు కూడ ప్ర‌త్యేకాహ్వాన‌మ‌లు పంపిస్తూ ఉంటారు. ఇచ‌ట అంతఃపుర‌కాంత‌లు సంగీత‌, నాట్య క‌ళాలీలా వినోద కేళుల‌లో స్వేచ్ఛ‌గా సంచ‌రించేటందుకు స‌ర్వానుకూలంగా వుంటుంది. భ‌వ‌న‌ర‌క్ష‌కులుగా, ప‌ర్య‌వేక్ష‌కులుగా కూడా శ‌రీరదార్ధ్య‌ముగ‌ల స్త్రీల‌నే నియ‌మించి నిర్వ‌హించుట మ‌రింత విచిత్ర‌మైన విశేష‌ము. అచ్యుత‌రంగ‌కూట ప్ర‌వేశ‌ము రాజుల‌కూ, యువ‌రాజుల‌కూ స‌హిత‌ము నిషిద్ధ‌మే అయినప్పుడు, ఇక ప్ర‌ముఖుల సంగతీ, సామాన్యుల సంగ‌తీ చెప్ప‌న‌క్క‌ర్లేదు.

స‌ర‌స్వ‌తీ గ్రంధ‌నిక్షేప‌భ‌వ‌న‌ము పూర్తియైన‌ది. అందు పొందు ప‌ర‌చుట‌కుగాను సంస్కృత ప్రాకృత‌, ఆంధ్ర‌, త‌మిళ, క‌న్న‌డ మ‌హారాష్ట్ర భాషా పండితుల‌చేత మ‌హాగ్రంధ‌ముల‌ను వ్రాయించితెచ్చుట‌కు ప్ర‌య‌త్నములు చేయ‌ద‌ల‌చినాడు ర‌ఘునాథుడు. చెవ్వ‌ప్ప‌నాయ‌కుల‌చే నిర్మిత‌మైన శివ‌గంగ త‌టాక‌మును శుభ్ర‌ప‌ర‌చి, మ‌రిన్ని తావుల‌లో మెట్ల‌ను క‌ట్టించి, ప‌ట్ట‌ణ‌మంత‌టికినీ నీరు స‌రిపోవున‌ట్లుగా ఏర్పాటు చేసినాడు. కుంభ‌కోణ‌ములోని దేవాల‌య‌మున‌కు మ‌హామండ‌ప‌ము క‌ట్టించినాడు. మాన‌లూరులోని మార్గ స‌హాయేశ్వ‌రున‌కు మ‌హావైభ‌వ‌ముగా ఆల‌య‌ము క‌ట్టించి, మ‌హారుద్రాభిషేక‌ము చేయించి, అర్చ‌కుల‌కు నూరుగ్రామాల‌ను దానం చేసినాడు. శ్రీ‌శైన‌స‌ప్త గిరీశ్వరుల ఆల‌య‌గోపురాల‌కు అదివ‌ర‌కున్న బంగారు తాప‌డ‌ములు చెడిపోవుచుండ‌గా మ‌ర‌ల చేయించినాడు. పెన్నేరున‌ది కిరుప్ర‌క్క‌ల శైవ‌, వైష్ణ‌వ దేవాల‌య‌ముల‌ను నిర్మించినాడు. వ‌ళ్ళంకోట‌లోని దుర్గ‌ము పూర్తి అయిన‌ట్లే.