98
 

క‌న్నెపిల్ల‌ల‌పాట్లు చెప్ప‌న‌ల‌వికాదు. కోకిల‌ను అనుక‌రిస్తూ, పాల‌పిట్ట‌ల‌ను ప‌ల‌క‌రిస్తూ, నెమ‌ళ్ళ‌తో క‌ల‌సి న‌డుస్తూ, హ‌రిణ శాబ‌కాల‌నులాలిస్తూ, పూల‌కో పండ్ల‌కో పుడ‌క‌ల‌కో భిల్ల వ‌నిత‌లు నిర్భ‌యంగా సంచరించేదినాలు గ‌తించిన‌వి. ఏక్ష‌ణాన ఏదుష్టుడు వ‌చ్చి ప‌ట్టుకొని ఈడ్చుకుపోతాడో, చీర‌ల‌ను సూటి చూపుత‌లో తూట్లు ప‌రుస్తాడో తెలియ‌దు. క‌న్నెపిల్ల‌లు గూడెల నుండి వెళ్ళిపోతూ ఉన్నారు. కొంత‌మంది ప‌డుచులు అనూహ్యంగా మాయ‌మైపోతూ ఉన్నారు. విదేశీల‌యులు వీరిని ప‌డ‌వ‌ల‌లో స‌ముద్రాల దాటించి ప‌ట్టుకుపోతూ ఉన్నార‌నే అనుమానం నాయ‌కుల‌ను ప‌ట్టి పీడిస్తూ ఉన్న‌ది. వారు త‌మ గోడును దేశాలేలే దొర‌ల‌కు మ‌న‌వి చేయ‌వ‌లెన‌ని అనుకొంటూ ఉన్నారు, ఇంత‌లోనే ఈ స‌మావేశం !

ర‌ఘునాథుడు : భార‌తావ‌నికి ఇది ప‌రీక్షా స‌మ‌యం. ఇది ఏదో ఒక ప్ర‌దేశానికో, గ్రామానికో, పాల‌కున‌కో పరిమిత‌మైన‌ది కాదు. మొత్తం దేశాన్నే చుట్టుకొంటూ ఉన్న దావాన‌లం. మ‌న సంప‌ద‌ల‌ను, ధ‌న‌ధాన్యాదుల‌ను, మ‌న స్త్రీల సౌంద‌ర్య లావ‌ణ్యాల‌ను చూచి విదేశీయుల క‌నుల ప‌చ్చ‌బ‌తుడూ ఉన్నాయి. వారి దురాశ‌కు అంతు లేకుండా పోతూన్న‌ది. ఒక వైపునుండి మ‌హ‌మ్మ‌దీయులు, ఒక వైపు నుండి పోర్చుగీలుపు, డచ్చివారు, ఆంగ్లేయులు మ‌న‌ల‌ను కొల్ల‌గొట్ట‌డానికి ప‌న్నుగ‌డ‌ల‌ను ప‌న్నుతూ ఉన్నారు. ఈ ప‌ర‌దేశీయులు వారిలో వారు పోరాడుకొంటూ, మాత్స‌ర్యంతో కొట్టుకుంటూ, వారి క‌క్ష‌ల‌ను తీర్చుకొన‌డానికి మ‌న దేశీయుల‌ను పావులుగా వాడుకొంటున్నారు. వీరి మూలంగా మ‌న‌లో మ‌నం యుద్ధాలు చేసుకొంటూ మ‌న ప్ర‌జ‌ల‌ను మ‌న‌మే నాశ‌నం చేసుకొంటున్నాము. ప్ర‌స్తుత కాలంలో వీరంద‌రూ మ‌న‌కు విరోధులు కారు. పోర్చుగీసు వారికిన్నీ, వారికి సాయ‌ప‌డుతున్న స్వ‌దేశీ ప్ర‌భువుల‌కున్నూ మ‌న‌ము గుణ‌పాఠం నేర్ప‌వ‌ల‌సి ఉన్న‌ది. ఈ మ‌హాయ‌జ్ఞానికి మీరంద‌రూ మ‌హాఋషుల‌వ‌లె ఉపయోగ‌ప‌డుతూ ఉన్నారు. దేశ‌మాత యొక్క శాంతి సౌభాగ్యాల‌ను కొల్ల‌గొంటూ ఉన్న నీచుల‌ను పార‌ద్రోలుతామ‌ని నీల‌మ్మ‌త‌ల్లి పాదాల అన‌గా మ‌న‌మంద‌ర‌ము శ‌ప‌ధంచేస్తూ ఉన్నాము.

ర‌ఘునాథ యువ‌ప్ర‌భువుల గంభీర కంఠ‌ము నుండి వెలువ‌డిన మ‌ధుర‌బాణి భ‌ర‌త‌ఖండాన్ని దాటుకొని స‌ముద్రాంత‌రాల‌నున్న పెర‌రాజ్యాల‌ను గ‌డ‌గ‌డ వ‌ణికించిన‌ది. ఆ మాట‌ల‌లో ఉరుములు ధ్వ‌నించిన‌వి. ప్ర‌భువుల దృఢ‌దీక్ష దేశ‌భ‌క్తి కార్య‌శూర‌త ప్ర‌తి ఒక్క‌ని హృద‌యాన్నీ క‌ద‌ల్చివేసి క‌ర్తవ్య నిర్వ‌హ‌ణ చేయ‌వ‌లెనన్న ఉత్కంఠ‌ను రేకెత్తించిన‌ది. అంద‌రూ త‌మ భుజాల‌ను అలంక‌రించిన అమ్ముల‌నూ ధ‌న‌స్సుల‌నూ అంటి, ధ్యానించి, అమ్మ ఆన అని దీక్షా బ‌ద్ధులైనారు.

యువ‌ప్ర‌భువులు అంద‌రితో ఆప్యాయ‌ముగా ప్ర‌సంగించి, ప్రేమ‌తో వెన్నుద‌ట్టి, మెచ్చుకొని వేంక‌ట‌ప‌తిరాజు వెంట‌రాగా న‌గ‌రోన్ముఖ‌ముగా ప‌య‌నించ సాగినారు. ప్ర‌భువుల వెంట వారంద‌రు ప‌ది ధ‌నువ‌లుమేర అనుస‌రించి, వెనుదిరిగి, ఒడ‌లెరుగ‌ని క్రీడాత‌త్ప‌రులైనారు.

బుడ‌త‌కీచు ఉడ‌త‌పీచు
గొంతుచూడు కీచు కీచు
వాడి మొగ‌ము రాగి చెంబు,
బొట్టులేని ప‌స‌రిక‌ము || బు ||
తాటిటెంక జుత్తుపీకి,
వాడి చేతిక‌ట్టె లాగి,
వాడి నెత్తినే బాదు,
వాడి గుండెనే మెదు
బాదు బాదు మోదు మోదు || బు ||

ఆ స‌మ‌యాన కొమ్ము బూర‌లు, త‌ప్పెట‌లు, కాలిగ‌జ్జ‌లు, డ‌ప్పుల శ‌బ్ద‌ములు అంబ‌రాన్ని ఛేదించుకొని పైపైకి పోయిన‌వి. ఆడా మ‌గా అంద‌రూ మద్యం ప్ర‌భావాన ఆడిపాడి కేరింతలు కొట్టి, ఆనాటి రేయంతా సంబ‌రాల తేలియాడానారు.

కుబ్జ దంతావ‌ళాలు సాధార‌ణంగా వృక్షాలు మ‌రీ గుబురుగా ఉన్న అంత‌రార‌ణ్యాల‌లో నివ‌సిస్తూ ఉంటాయి. భారీ ఏనుగులు వ‌లెనే అవి కూడా మంద‌లు మంద‌లుగా సంచ‌రిస్తాయి. గాని ఒంట‌రిగా బ‌య‌లువెడ‌ల‌వు. ఒక్కొక గుంపులో సుమారు అర‌వై, డెబ్బ‌ది ఏనుగుల వ‌ర‌కు ఉంటాయి. మ‌రీ చిన్న గుంపులోనైనా సుమారు ముప్ప‌దికి త‌క్కువ‌గాకుండా ఉంటాయి. ఒక ఎదిగిన ధీశాల‌న్నీ బ‌ల‌శాల‌న్నీ అయిన ఏనుగు, రాజులాగ‌, గుంపున‌కు ముందు న‌డుస్తుంది. గ‌జ‌రాజుకు బుద్ధి కౌశ‌ల్య మెక్కువ‌. అందుచేత‌నే మ‌హేశ్వ‌రుడు త‌న కొమ‌రున‌కు ఏనుగు త‌ల‌ను అమ‌ర్చినాడు. ఈ గ‌జ స‌మూహంలోని క‌రేణుల‌కు రాజేనాయ‌కుడు. వానిన‌నుస‌రించ‌డంలో ఆడ ఏనుగులు స్ప‌ర్ధ వ‌హిస్తూ, ఒక‌దానినొక‌టి అధిగ‌మించాల‌ని అత్ర‌ప‌డుతూ, వెన్నంటి న‌డ‌వ‌డానికి శీఘ్ర‌గాములౌతూ ఉంటాయి. గ‌జ‌రాజు త‌న‌ను న‌మ్ముకున్న త‌న‌వారి ఆశ‌ల న‌డియాస చేయ‌డు. బ‌హు జాగ‌రూక‌త‌తో అటు ఇటు త‌ల‌త్రిప్పి చూస్తూ, ఏ చిన్న శ‌బ్దాన్నైనా ఆల‌కించ‌డానికి స‌దా సిద్ధ‌ముగా ఉన్న‌ట్లుగా చెవుల‌ను కొంచెము ఆడిస్తూ, క్రిందికి చూస్తూ త‌న అనుచ‌రులు వ‌స్తున్నారో లేదో గ‌మ‌నిస్తూ న‌డుస్తాడు.