ప్రమాదాన్ని పసిగట్టిన క్షణంలో ఏనుగురాజు అడవి దద్దలిల్లేటట్లు ఘీంకరించి, వెనుదిరిగి తనవారిని హెచ్చరిస్తాడు. గుంపతా ఒక్కుమ్మడిగా శత్రువుమీద దాడి చేస్తుంది. ఈ కారణాలవల్ల గజబంధనం మహాకష్టం. ఎంతకష్టమైనప్పటికిన్నీ మానవ మేధ క్రొత్తక్రొత్త పంధాలనను కనిపెడుతూనే ఉంటుంది. ప్రకృతిని తన అవసరాలకు ఉపయోగించుకొనే విధానాలలో నూత్నావకాశాలను సృష్టించుకొంటూనే ఉన్నది.
ఎదిగిన ఏనుగులకంటె పిల్ల ఏనుగులను పట్టుకొనుట సులభం. అందుచేత కొందరు భిల్లులు బాలగజాలను పట్టి బంధించి, యుద్దాది విద్యలను నేర్చించి రాజులకు అవసరమైన కాలాలలో విక్రయిస్తూ ఉంటారు. కొందరు రాజకుమారులు మదించిన ఏనుగును లొంగదీయడమనే సాహస కార్యాన్ని ఒక గొప్ప కేళి అని భావిస్తూంటారు. కాని అరణ్యాన్నుండి క్రమశిక్షణ ఎరుగని ఏనుగును సరాసరి రాజధానికి తీసుకొని రావడంకంటె సుశిక్షితమైన ఏనుగును సంపాదించడమే శ్రేయస్కరం, శ్రేష్టం.
మానవుని దంతావళం బాగుగా అనుకరించగలదు. కేవలం అనుకరణయే గాక బుద్ధిని కూడా ఉపయోగించే సుశిక్షితుడైన గజరాజు తన రాజ్య రక్షణకు ఎంతగా ఉపకరించగలదో రాజులు గ్రహించినారు. కావుననే గజ సేనకు ఎంతో ప్రాముఖ్యాన్నిస్తూ ఉన్నారు. గజదళము మిక్కిలి అధికంగా ఉన్న రాజును చూచి శత్రురాజు గడగడలాడతాడు. ఏనుగును పట్టుకోవడం చాలా కష్టంకాని ఏనుగు వల్ల కలిగేలాభం, పడిన శ్రమకన్న ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది.
కప్పలదొర నాయకత్వంలో కళింగతీరం నుండి కొంకణతీరం వరకు గల శబరవీరులు అనేక చర్చలు చేసి కుబ్జదంతావశాలను పట్టుకొనుట, పట్టిన వాటికి శిక్షణ గరుపుట, తదుపరి ఏయే తీరాలనుండి ఈ గజసమూహాలను తరలించుకొని వచ్చి ఎచ్చట రఘునాథ యువప్రభువుల కర్పించాలి మున్నగు అన్ని విషయాలూ నిర్ధారించుకొన్నారు.
14
శ్రీశ్రీశ్రీ అచ్యుతప్పనాయనింవారు, సమర్ధవంతుడున్నూ, శక్తి మంతుడున్నూ, దయాశీలుడున్న, ధర్మరక్షణతత్సరుడన్నూ, న్యాయ విచక్షణాశీలిన్నీ అయిన రఘునాథ యువప్రభువు భుజస్కంధాలపై తంజపురీ సర్వంసహాదేవి యొక్క సమస్త భారాన్నీ ఉంచి, శ్రీ రంగేశుని పదసరోజాలపై మనోబుద్ధ్యంతరాత్మలను కేంద్రీకరించి, అకుంఠిత భక్తిభావముతో, సదా ధ్యానతత్పరతతో దినాలను గడుపుతూ ఉన్నారు. రఘునాథ కుమారులకు మహారాజ్య పట్టాభిషేకము గావించి తాము వాన ప్రస్థాశ్రమమును స్వీకరించి, శ్రీరంగపట్టణమునకు పోవలెనన్నదే ఆ ప్రభువుల నిత్యకాంక్ష. రఘునాథ కుమారులు తండ్రిగారిని వదలియుండలేక మరి కొన్నాళ్ళు, మరి కొన్నాళ్ళు అంటూ కాలయాపన చేస్తూ ఉన్నారు.
సరిహద్దు తీరములలో మథురనాయకుల ఆగడములు మితిమీరుతున్నవి. తంజపుర వాసులను రెచ్చగొడుతున్నారు. వారి దుష్టచర్యలను తెలియజేస్తూ వేగులు పుంఖానుపుంఖాలుగా వార్తలను రఘునాథ యువ ప్రభువులకు చేరవేస్తూ ఉండిరి. కొలువుకూటాన యువప్రభువులు అతి చాకచక్యముగ సమస్యలను పరిష్కరిస్తున్న విధానాన్ని గమనించిన మహారాజుల మనస్సు ముదముతో నటనమాడినది. ఇకను తన ఉనికివలన, తనయునికి లాభించు ప్రయోజనము ఏమీలేదని గ్రాహ్యమైనది. అచ్యుత నాయనింవారి మనస్సు శ్రీరంగేశుని పద సన్నిధానానకు పరుగులిడుతూ ఉన్నది. శరీరంలో జవసత్వాలు ఉన్నప్పటికిన్నీ హృదయం వైరాగ్య భావంతో పండివృద్ధయై నందున గోవింద యజ్వ, రఘునాథ యువప్రభువులచేత లేలేత భుజాలపై రాజ్యభారాన్ని మోపినారు. |