119
 

శుక‌వాణి, ఈ దిన‌ము నాట్య‌శాస్త్రాధ్య‌య‌నం చేతాము.

ప్రభూ ! త‌మ రాక‌ను గ‌మ‌నించ‌లేక‌పోయాను ఆమె కంఠ‌స్వ‌రం విచ‌లిత‌మైన‌ది.

వాణి ! నేను నీ శార‌దారాధ‌నానికి విఘ్నం క‌లుగ‌చేశానా ?

లేదు, ప్ర‌భూ ! శార‌దారాధ‌నానికి ఇదె గ‌జ్జెక‌డుతూ ఉన్నాను.

శుక‌వాణిని చిరుమువ్వ‌ల అందెల‌ను ధ‌రించి ప్రభువులు బోధించే విష‌యాన్ని అభిన‌య‌ములో అవ‌గాహ‌న చేసుకొన‌డానికి సంసిధ్ధ‌యైన‌ది.

స‌ర్వ శాస్త్రార్ధ సంప‌న్నం స‌ర్వ‌శిల్ప‌ప్ర‌వ‌ర్త‌క‌మ్‌

నాట్యాఖ్యం పంచ‌మం వేదం సేతిహాసం కరోమ్య‌హ‌మ్‌.

చ‌దుర్విధ పురుసార్ధ సాధ‌క‌ము య‌శ‌స్క‌ర‌ము అయిన నాట్య‌శాస్త్ర‌మును చ‌తుర్ముఖుడు భ‌ర‌తాచార్యున‌కు సుబోధ‌క‌మొన‌రించినాడు. ఈ నాట్యం కేవ‌ల‌ము మ‌నుష్య ప్ర‌కృతినే గాక‌, ముల్లోక‌ముల‌లోని య‌క్ష కిన్నెర గ‌రుడ గంధ‌ర్వ దేవ‌తాది మ‌హానుభావుల‌ను ప్ర‌ద‌ర్శిచ‌గ‌ల‌దు.

నానాభావోప సంప‌న్నం నానావ‌స్థాంతరాత్మ‌క‌మ్‌

లోక‌వృత్తానుక‌ర‌ణం నాట్య‌మే త‌న్మ‌యాకృత‌మ్‌

ఇలాగ బ్ర‌హ్మ భ‌ర‌తున‌కు బోధించినాడు. అంగిక‌, వాచిక‌, ఆహార్య‌, సాత్విక భేద‌ముల‌తో నాట్య‌ము నాలుగువిధ‌ములు.

శారీర‌క‌ము, ముఖ‌జ‌ము, చేష్ఠాకృత‌ము అని అంగ ఉపాంగ స‌హిత‌మైన‌ది. అంగికాభిన‌య‌ము. శిర‌ము, హ‌స్త‌ములు క‌టి, ఉరము, పార్శ్వ‌ములు, పాద‌ములు అనున‌వి అంగ‌ములు. నేత్ర‌ములు, క‌నుబొమ్మ‌లు, నాసిక, అధర‌ము, క‌పోల‌ములు, చిబుక‌ము అనున‌వి ఉపాంగ‌ములు.

వాణి ! అభిన‌య‌మే నేర్పినానుకాని శాస్త్ర‌ము నేర్పి ఉండ‌లేద‌ని గురు దేవులు సెల‌విచ్చినారు కావున ప్రాధ‌మికాంశ‌ముల‌తో శాస్త్ర ప్రారంభం చేస్తూ ఉన్నాను ప‌ద‌మూడు శిరఃకంప‌ముల‌లో నీకు ఎన్ని వ‌చ్చును ?

ప్ర‌భూ ! ఆరు వ‌చ్చునండి.

అవ‌ధూత‌మును చూపుము.

నాట్య‌స‌మ‌యాన అభిన‌యించుటేగాని వీని పేర్లు తెల‌య‌వు.

శుక‌వాణి శిరఃకంప‌నాన్ని అభిన‌యించిన ఒక్కొక్క విద‌మున‌కు ఒక్కొక్క నామ‌మును ప్ర‌భువులు ఉచ్ఛ‌రించిరి.

ఇది విధుత‌ము. ఇది ఆకంపిత‌ము. పరివామిత‌ము, కంపిత‌ము, ఆధూత‌ము. ఇది అవ‌ధూత‌ము. ఇవి నీవు చేర్చిన‌వి. నీవు నేర్వ‌నివి ఇవి, ఇలా చేయాలి.

నానాభావ‌ములు ముఖంలో ప‌లుకుత‌వి. అంచిత‌....ఇలా...నిహంచిత మిలా...

శుక‌వాణి శిర‌మును రెండుచేతులా ప‌ట్టి స‌మ‌స్థానంలో ఉండున‌ట్లుగ నియ‌మింప‌జేసే స‌మ‌యాన ఇరువుర‌కును సామీప్య‌ము ఎక్కువైనందున ఉద్వేగ ప్ర‌వృత్తికి లోనైరి.

ప్ర‌భూ ! లోలిత‌ము క‌ష్ట‌మా !

నీవంటి స్వాధీన‌శార‌ద‌కు లోలిత‌ము ప‌ర‌వృత్త‌, ఉత్‌క్షిప్త అధోగ‌త‌ములు కూడ క‌ష్ట‌ములు కావు. నీవు రెంటిమూడింటినొక‌మారు ప్ర‌ద‌ర్శించ గ‌లుగుతూ ఉన్నావు.
ప్రేర‌ణి దండ‌లాస్య‌మును బ్రేంఖ‌ణి కుండ‌లినా జ‌తుర్విధో
దార‌ములైన నాట్య‌ముల‌యంద‌ము లెల్ల నెఱింగియందు నిం
పారుచునుండు మూడు ప‌దులాఱును నై త‌గునంగ‌మార్గ‌ముల్‌
సార‌స భావ దృష్టుల‌ల‌ర‌న్ న‌టియించ‌వె మాట‌లేటికిన్‌.