121
 

న‌వ‌ర‌సాల‌లో శృంగార ర‌స‌మున‌కు అధినాధుడు, కంఠాన గ‌ర‌ళం దాచుకొన్న ప‌ర‌మ‌శివుడు. అట్టి ఇత‌డే ఈ ర‌స‌ప్రేర‌కుడైన మ‌న్మ‌ధుని న‌శింప‌చేసిన వాడు కూడా కావ‌డం మ‌రొక విశేషం. ఇందులోని నిగూఢార్ధం నీకు అవ‌గ‌త‌మ‌వుతుందేమో యోచించు.

ఆ శివుని చేష్ఠ‌ల‌న్నీ అట్లే నిగూఢ‌ములు కావా, ప్ర‌భూ ! స‌ర్వ జ‌గ‌త్తుల‌కూ ఐశ్వ‌ర్య ప్ర‌దుడైన‌ప్ప‌టికినీ ఆ గ‌జ‌చ‌ర్మ‌దారి శ్మ‌శాన నివాసియై, జోగియై భిక్షాట‌నం చేస్తూ ఉంటాడు.

నిధులు ఉన్న తావుల త్యాగ‌గుణం ఉండ‌డ‌మే శోభావ‌హ‌మ‌ని ఈ విష‌యం తెలియ‌చెపుతూ ఉన్న‌దా ?

ప్ర‌భూ ! శృంగార‌ర‌స‌ము స‌మ‌స్త ర‌స‌ముల‌కు నాయ‌క‌మ‌ణి

ఏదీ, ఈ ర‌ఘు నాథుడు నాయ‌క ప్ర‌భువుల‌లో మ‌ణియైన‌ట్లేనా ?

శుక‌వాణి చిలిపిగా న‌వ్వి, ఆత్మ‌స్తుతిని చేసికొనే ఆగ‌త్యం మీకు లేదు ప్ర‌భూ ! నేనున్నాను కానా ? అన్న‌ది.

ఓహో ! ఇంత‌వ‌ర‌కు అడిగిన దానికి ప్ర‌త్యుత్త‌ర మీయ‌డం త‌ప్ప, పెద‌వి విప్పి ఒక్క ప‌లుకైనా ఆడ‌ని నీవు న‌న్ను స్తుతిస్తావా ! కాక‌పోతే కోతిలాగున ఉండి గూని న‌డ‌క‌ల‌తో గూబ క‌న్నుల‌తో ఉన్న‌ట్లు చిత్రించి కొంటెపాట‌లు పాడుతావూ ! అంటూ, కృష్ణ‌స‌ర్పంలా ఉన్న శుక‌వాణి వేణిని ప‌ట్టి క‌నుల‌క‌ద్దుకొని వ‌ద‌లినారు ర‌ఘునాథ యువ ప్ర‌భువులు.

అర‌ఘ‌డియ త‌రువాత ఆనాటి విద్యాబోధ‌న‌, త్రిభంగ‌, అభంగ‌, అతిభంగ‌, స‌మ‌భంగాది భంగిమ‌లు, క‌ట‌కాసూచీ, లోల అర్ధ‌చంద్ర‌వ‌రద‌, అభ‌యాది హ‌స్త‌ములు, అర్ధ‌నిమీలిత‌, విమీలిత, ఉన్మీల‌నాది దృగ్భేద‌ములు మున్న‌గువాని విశేషాంశ‌ముల చర్చ‌ల‌తో ముగిసిన‌ది.


16

ల‌క్ష్మీవిలాస భ‌వ‌నాన మ‌హారాజులు శ్రీ‌శ్రీ‌శ్రీ అచ్యుత‌నాయ‌నిం వారి స‌మ‌క్షాన వ్యాక‌ర‌ణ‌వేత్త‌లు, త‌ర్క‌విద్యావిశార‌దులు, అలంకార శాస్త్ర కోవిదులు, క‌వి పండిత శిరోమ‌ణులు, ఆస్థాన‌క‌వులు ఆశీనులై ఉండిరి. సంస్కృత భాష‌లో ర‌చింప‌బ‌డిన‌, కుమార‌సంభ‌వ గ్రంధ‌మున‌కు ప్ర‌తులు వ్రాయించి అభిప్రాయ‌ముల‌ను కోరుతూ వారంద‌ర‌కు మ‌హారాజుల‌వారు ప్ర‌తులు పంపించి నేటికి ప‌దిదినాలాయెను. నేటి స‌భ‌లో ఆ గ్రంధ చర్చ జ‌రుగుతూ ఉన్న‌ది. ఆస్థాన‌క‌వులైన కృష్ణాధ్వ‌రి, రాజ‌చూడామ‌ణి, చేమ‌కూర వేంక‌ట‌క‌వి ఒక‌వైపున‌, అమాత్యులు గోవింద‌మ‌ఖి మ‌హారాజులు....ఉన్న‌త సింహాస‌నాన‌, అంత‌క‌న్న కొంత దిగువ‌న ఉన్న ఆస‌నంపై ర‌త్న‌భేట శ్రీ‌నివాస దీక్షితులు ఆశీనులైరి. య‌జ్ఞ‌నారాయ‌ణుడు, వేంక‌ట‌మ‌ఖి, మరియొక ప్ర‌క్క‌న సంస్కృత క‌వులైన అభిన‌వ కాళిదాసు, సౌమిల్లి, మురారి మాత్ర‌మెగాక‌, క‌ర్ణాట‌, త‌మిళ, కావ్య ప్ర‌బంధ‌క‌ర్త‌లు  కుమార సంభ‌వ కావ్య‌చర్చ‌లో పాల్గొనుట‌కై ఆశీనులై ఉండిరి.

ర‌త్న‌భేట శ్రీనివాస దీక్షితుల‌వారు ప్రారంభ ప్ర‌సంగ‌ము చేయ‌ద‌ల‌చి, మ‌హాప్ర‌భువులు పంపిన గ్రంధ‌ము యొక్క క‌ర్త ఎవ్వ‌రో తెలియ‌జేయ‌లేదు, ఆనిరి. దీక్షితుల‌వారూ ! గ్రంధ‌మెవ్వ‌రి కృత‌మన్న‌ది ప్ర‌స్తుత ప్ర‌శ్న‌కాదు. అందులో నిక్షిప్త‌మైన విలువ‌లెట్టివి ?  విశ్వ‌శ్ర్శేయ‌మ్ కావ్య‌మ్ అన్న విష‌య‌ము ఇందు పాటింప‌బ‌డిన‌దా ? అలంకార‌ము. ఛంద‌స్సు, ఔచిత్య‌ము, రీతి, శైలి ఎట్లున్న‌వి ?   మున్న‌గు గుణ‌దోష చర్చ చేయుట‌కు మ‌న‌మిచ‌టికి రావింప‌బ‌డితిమి, అని అమాత్యుల‌వారు గంభీర‌కంఠాన వాక్రుచ్చిరి.

శ్రీ‌నివాస దీక్షితులు, చేమ‌కూర వేంక‌ట‌ప‌తిక‌వి, మురారి మొద‌లైన వారు కావ్య‌ము బ‌హుప్ర‌శ‌స్త‌ముగ నున్న‌ద‌ని ప‌లికిరి. భావ‌మున‌కు అనుకూల‌మైన ఛంద‌స్సును ప్ర‌యోగించి గ్రంధ‌క‌ర్త నూత్న మార్గ‌మును త్రొక్కెన‌ని నిర్ద్వందముగా ప్ర‌స్తుతించిరి.

త‌నుమ‌ధ్య వృత్త‌ములో పార్వ‌తీదేవి నెన్న‌డుమును వ‌ర్ణించిన రీతి ప్ర‌శంస‌నీయ‌ము ఇంద‌లి శ్లోక‌ములు నాట్యానుగుణ‌ములుగ‌, గాన‌ము చేయుట‌కును కూల‌ముగ ఉన్న‌వి. ఇందు స‌ర్వ‌త్ర గ్రంధ‌క‌ర్త యొక్క సంగీత‌, నాట్య‌క‌ళా పాండిత్య‌ము ప్ర‌స్ఫుట‌మ‌వుతూ ఉన్న‌ది, అని మిక్కిలిగా మెచ్చినారు.