124
 

రామ‌భ‌ద్రాదేవి వైదుష్యాన్ని గూర్చి చెంగ‌ల్వ‌కాళ‌క‌వి ప్ర‌స్తుతించినాడు. రామ‌భ్ర‌దాదేవి శుక‌వాణి దేవివ‌లెనే అష్ట‌భాషాప్ర‌వీణ‌. ఇరువురును చ‌తుర్విధ క‌వితా ప్ర‌క్రియ‌ల‌లో నిష్ణాతులే. ర‌ఘునాథ‌నాయ‌కాభ్యుద‌య‌ము అనే సంస్కృత‌కావ్యంలో యువ‌రాజులైన భ‌ర్త‌గారినే కావ్య‌నాయ‌కుల‌ను చేసి య‌దార్ధ‌గాధ‌ను ప్ర‌కటిస్తూ ఉన్న ప్ర‌జ్ఞాశాలిని రామ‌భ‌ద్రాదేవివారు అని చెంగ‌ల్వ క‌ళాక‌వి విశ‌ద‌ప‌ర‌చినాడు.

శ్రీ‌శ్రీ‌శ్రీ అచ్యుత‌నాయ‌ని వారు, ఈ ఇరువురు మ‌హిళామ‌ణుల‌ను ఆస్థాన కవ‌యిత్రులుగా నియమించ శ‌శ్వ‌త్కీర్తిని పొంద‌గోరుచూ ఉన్నాను, అని ప్ర‌క‌టించి, వేదఘోషాల మ‌ధ్య‌న‌, దివ్య‌సంగీత వాయిద్యాల న‌డుమ‌, న‌వ‌ర‌త్న ఖ‌చిత‌మైన బంగ‌రు పూత‌లుగ‌ల ముత్యాల‌జాలుల‌తో వ్రేలాడే ఉష్ణీవాల‌ను శుక‌వాణీ, రామ‌భ్ర‌దాదేవుల‌కు శిరోభూష‌ణంగా అలంక‌రించినారు. భేరీకాహ‌ళులు మ్రోగిన‌వి. శంఖ‌ములు పూరింప‌బ‌డిన‌వి. ఆనాటి స‌భ నృత్య‌గాన క‌వితా నాట‌కాది వినోద‌ముల‌తో క‌న్నుల పండువై అల‌రాలిపోయిన‌ది.

పాదాభివంద‌నం చేసిన శుక‌వాణిదేవి మూర్ధాన్ని మూర్కొని గోవింద దీక్షితుల‌వారు మౌనంగా వేదాశీర్వ‌చ‌నాన్ని అందించినారు. త‌మ ప్రియ శిష్య ఇంత‌టి మ‌హోన్న‌త‌స్థానాన్ని అందుకొన‌గ‌ల్గినందుల‌కు ఆనందో ద్వేగాల‌కు లోనై వారి గొంతు మూగ‌వోయిన‌ది. ఆమె గురుపరంగా లిఖించిన సంస్కృత శ్లోక‌ము ఎన్నిమారులు త‌ల‌చుకోన్న అన్ని మారులూ అమాత్యులు ప‌ర‌వ‌శుల‌వుతూనే ఉంటారు.

ఇటువంటి మ‌హాస‌త్కార‌ము త‌మ‌కు జ‌ర‌గ‌బోతూ ఉన్న‌ద‌న్న భావ‌ము శుక‌వాణి దేవికిగాని, రామ‌భద్రాదేవికిగాని ఊహామాత్ర‌ముగానైన క‌లుగ‌లేదు. మూర్తెప్ప నాయ‌కులు మ‌ర‌క‌త‌వ‌ల్లీ దేవి ప‌ర‌మానం భ‌రితులైరి. ఇంత‌టి గౌర‌వాన్ని మ‌హిళ‌ల‌కీయ‌డం అదే ప్ర‌ధ‌మ‌మైనందున న‌గ‌రిలోని ప్ర‌ముఖుల‌కేగాక సామాన్య పుర‌ప్ర‌జ‌ల‌కు కూడ అబ్బుర‌పాటు క‌ల్గించిన‌ది. క‌ల‌యిత్రుల‌కు స‌భాప్ర‌వేశం ఆస్థాన స‌న్మానం క‌ల్పించినందుల‌కు, శ్రీ‌శ్రీ‌శ్రీ అచ్యుత నాయ‌నిం వారి కీర్తి ఆచంద్ర‌తారార్కం, చిర‌స్థాయిగా నిల‌చిపోవున‌ని ప్ర‌జ‌లు వేనోళ్ళ కీర్తించిరి.

వార్ధ‌క్య‌మున మునివృత్తిని స్వీక‌రించ‌వ‌లెన‌నే స‌దాచార‌మును పాటించ ద‌ల‌చిన శ్రీ‌శ్రీ‌శ్రీ అచ్యుత‌నాయ‌క మ‌హారాజు గోవింద దీక్షితుల‌చే ర‌ఘునాథ నాయ‌కుల‌ను పట్టాభిషిక్తుని చేయ సుమూహూర్త‌మును నిర్ణ‌యింప‌జేసినారు.

సౌమ్యే భావి నివాస‌రే శుశ‌దినే
శౌండీర్య ముఖ్యైర్గుణైః

చ‌తుర‌ర్ణ‌వీప‌రివృత చోళ భూదేవి వ‌హన‌భారాన్ని ర‌ఘునాథుని భుజ ద్వ‌యంపై మోపి, తాను శ్రీ‌రంగ‌మునందు నారాయ‌ణ‌స్మ‌ర‌ణ‌మును చేయుచు త‌నువు చాలింప‌ద‌ల‌చినారు.

ర‌ఘునాథ నాయ‌కుల ప‌ట్టాభిషేక మ‌హోత్స‌వ‌ములు తిల‌వించుట‌కు ఉత్త‌ర ద‌క్షిణ భార‌త‌దేశ‌ముల నుండి మ‌హారాజులు, రాజ‌ప్ర‌తినిధులు, క‌వులు, పండితులు, శాస్త్ర‌జ్ఞులు, సంగీత నాట్య‌క‌ళాకోవిదులు విచ్చేసినారు. కొంద‌రు వారివారి ప్ర‌జ్ఞాప్ర‌ద‌ర్శ‌నం చేసి, బ‌హుప్ర‌కారములుగా స‌న్మాన‌ములందిరి. యూర్ధ‌భిషిక్తులైన శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌ఘునాధ నాయ‌క మ‌హారాజుల వారు అన్న దాన‌, స్వ‌ర్ణ‌దాన‌, భూదానాది షోడ‌శ మ‌హా దాన‌ముల‌ను చేసి స్వ‌ర్ణ‌టంకాల‌నున వెద‌జ‌ల్లి అశ్రిత‌ప్ర‌జ‌ల‌ను సంతృప్తును చేసిరి.

శ్రీ అచ్యుత నాయ‌కుల‌వారి హృద‌య‌ము సంత‌స‌ములో నిండిపోయిన‌ది. నిత్య‌తృప్తులై, భార్య‌ల‌తో గూడి శ్రీ‌రంగ‌నగ‌ర ప్ర‌వేశానికై బ‌య‌ల్వెడ‌లుతూ ఉండ‌గా, ర‌ఘునాథ‌నాయ‌కుల హృద‌య‌మ‌త్యంత దుఃఖానికి...లోనైన‌ది.

తండ్రీ ! శ్రీ‌మ‌న్నారాయ‌ణుడు శ్రీ‌రంగంలోనే గాని శ్రీ‌వారి హృద‌య పంజ‌రాన లేకున్నాడా ? త‌మ పాద‌సేవ చేసి త‌రించే భాగ్యంలేకుండా చేస్తూ ఈ  ప‌య‌న‌ము ఎందుల‌కో ?   మిమ్ముల‌ను విడిచి నేనూ, ఈ రాజ్య‌ప్ర‌జా ఎలా మ‌న‌గ‌లిగేది, నాన్నాగారూ ?

శ్రీ అచ్యుత నాయ‌నిం వారు కొమ‌రుని గ్రుచ్చి అక్కున జేర్చుకొన్నారు.

పిచ్చితండ్రీ ! శ్రీ‌ధ‌రుడ‌న్ని తావుల‌లోను ఉండ‌నీగాక‌, శ్రీ‌రంగ‌స్మ‌ర‌ణ మాత్రం చేత‌నే నా మ‌న‌స్సు, శ‌రీర‌ము పుల‌క‌లెత్తిపోతూ ఉంటాయి. ఇక ఆ న‌గ‌రంలోనే నివాస‌మ‌నుకుంటే నాకు ప‌ట్ట‌రాని ఆనందంగా ఉంటుంది. అక్క‌డ‌కు రావాల‌నుకుంటే ఏ మాత్ర‌పు దూర‌మున్న‌దయ్యా ! క్ష‌ణాల‌లో వ‌చ్చి వాల‌వ‌చ్చు. అది స‌రేగాని, మ‌హారాజ !