125
 

శుక‌వాణి దేవికి మీరు చేస్తూ ఉన్న బోధ‌న‌ము ఎంత‌వ‌ర‌కు వ‌చ్చిన‌ది ?

నాన్న‌గారూ ! ఆమెకు గొప్ప‌ధార‌ణ‌శ‌క్తి ఉన్న‌ది. ఏక సంధాగ్రాహి, ఆమె స‌ర్వ‌జ్ఞురాలు.

శుక‌వాణి దేవిని మీరు వివాహ‌మాడ‌లెన‌న్న‌ది మీ మాతృశ్రీ‌, మూర్తిమాంబా దేవివారి గాఢ‌వాంఛ‌గా ప‌రిణ‌మించిన‌ది. కాని....

ఆజ్ఞాపించండి, నాన్న‌గారూ !

కానీ గోవింద దీక్షితుల‌వారి అంగీకార‌ము లేనిదే మీరు త్వ‌ర‌ప‌డ వ‌ద్దు.

శిర‌సావ‌హిస్తాను. అలాగే త‌ప్ప‌క ఆచ‌రిస్తాను, నాన్న‌గారూ !

శ్రీ అచ్యుత‌నాయ‌నిం వారు మూర్తిమాంబా దేవి స‌మేతులై శ్రీ‌రంగ క్షేత్రానికి ప‌య‌న‌మ‌వుతూ ఉండ‌గా మ‌హారాణులు మువ్వురూ వారికి పాదాభివంద‌న మొన‌రించిరి. దీర్ఘ‌సుమంగ‌ళీ భవ అని ఆశీర్వ‌దించి, వారు ముందుకు సాగినారు.

శుక‌వాణి క‌నులు శోక‌భారంతో మందార‌ములైన‌వి. శోకిస్తూ ఉన్న ప్ర‌జ‌ల‌ను చూచి, ఈ ప్ర‌భువు జ‌న‌క‌మ‌హారాజు వంటివారు. ఇట్టి వారిని దూరం చేసికొంటూ ఉన్న ప్ర‌జ‌ల‌కు దుఃఖం క‌లుగ‌కుండా ఎలా ఉండ‌గ‌ల‌దు ? అని త‌ల‌పోసిన‌ది.

శ్రీ అచ్యుత‌నాయ‌నిం వారి ర‌ధ‌ము మెల్ల‌గా క‌దిలిపోతూ సెల‌యేటిని దాటు వ‌ర‌కూ స‌మ‌స్త ప్ర‌జానీక‌ము వెంట‌వ‌చ్చినారు. కడ‌సారి వీడ్కొలు ప‌లికి వెనుతిరిగి పురాభిముఖులై న‌డిచినారు.

శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌ఘునాథ నాయ‌క మ‌హారాజుల‌వారు వార‌ము దిన‌ముల వ‌ర‌కు హృద‌య‌భారంతో కార్య‌మ‌గ్నులు కాలేక‌పోయిరి. ఇందిరామందిరాన శుక‌వాణిదేవి సాన్నిధ్యంలో అనంతంగా వీణావార‌నం చేస్తూ, ఆమె క్రొంగోటితో నిన‌దింప‌జేస్తూ ఉన్న వీణానిక్వాణాల‌న‌ను వింటూ కాలాన్ని నెట్టిరి.

గోవింద దీక్షితుల‌వారు, స‌ర‌స్వ‌తీదేవికి ఈ కాల‌ము ప‌ర‌మోచ్ఛ‌ద‌శ య‌ని వాక్రుచ్చిరి. సంస్కృతాంధ్ర‌, ద్ర‌విడ‌, క‌ర్ణాట‌క భాష‌ల‌లో మ‌హా కావ్యాలు అనేకంగా ఉద్భ‌వించిన‌వి. శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌ఘునాథ నాయ‌క మ‌హా రాజులు ల‌క్ష్మీస‌ర‌స్వ‌తుల మ‌హాతాండ‌వ నాట్యానికి శాశ్వ‌త స్మృతిచిహ్నంగా శార‌దా ధ్వ‌జ‌మును ప్ర‌తిష్ఠించి, శార‌దాదేవికి రాచ‌మ‌ర్యాద‌ల‌తో, రాజోప‌చారాల‌తో ఆరాధ‌నాన్ని గావించినారు.

కృష్ణా గోదావ‌రీ నాగావ‌ళీ మ‌హాన‌దీ తీర‌ముల‌నుండి కూడ శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌ఘునాథ నాయ‌కుల సార‌స్వ‌త సేవ‌ను తెలిసికొని మ‌హాక‌వులు, పండితులు త‌మ త‌మ గ్రంధాల‌కు స‌రిఅయిన గుర్తింపు తంజ‌పుర‌మున‌నే ల‌భింప‌గ‌ల‌ద‌ని తాళ‌ప‌త్ర వ్రాత‌క‌విలెల‌ను మోసికొని రాసాగిరి. ఆంధ్ర‌క‌వితా వ‌ధూటికాపురి నృత్య‌రంగ‌మై విల‌సిల్లిన‌ది.

కృష్ణ‌రాయ‌ల కాలాన ప్ర‌భ‌వించిన ఆంధ్ర‌ప్ర‌బంధ స‌ర‌స్వ‌తి నాయ‌క‌రాజుల కాలాన యౌవ‌న‌వ‌తియై న‌వ‌విలాస‌ముల‌ను హోయ‌లును ప్ర‌ద‌ర్శింప సాగిన‌ది. య‌క్ష‌గాన‌ములు, నాట‌క‌ల‌ములు అనేక‌ములుగా రూనుదాల్చిన‌వి. ఆశుక‌విత్వ‌ములు, అష్టావ‌ధాన శ‌తావ‌ధాన‌ములు. నిరోష్ట్య నిర్వ‌చ‌న చిత్ర‌బందాధి వివిధ‌ములైన క‌వితా ప్ర‌క్రియ‌ల‌క‌ది మంచి కాల‌మైన‌ది. క‌మ‌లినీ క‌లహంస‌ము, ఆనంద‌రాఘ‌వ‌ము, ర‌ఘునాధాభ్యుద‌య‌ము మొద‌లైన సంస్కృత నాట‌క‌ముల‌ను వాడ‌వాడ‌ల ప్ర‌ద‌ర్శింప సాగిరి. సంగీత‌సుధ‌, సాహిత్య సుధ‌, తంత్ర చింతామ‌ణి, తాళ చింతామ‌ణీ, నైష‌ధ పారిజాతావ‌తారిక‌లు, అమ‌రుక‌ము శృంగార‌శాస్త్ర‌ము మొద‌లైన అత్యుత్త‌మ‌మైన‌, క‌ఠిన‌త‌ర‌మైన శాస్త్ర మ‌హా విష‌య‌ముల‌ను సామాన్య ప్ర‌జ‌ల క‌రత‌లామ‌ల‌క‌ము చేయ‌నెంచి సుల‌భ‌త‌ర శైలిలో వ్రాయ‌సాగిరి.

శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌ఘునాథ మ‌హరాజులు చేప‌ట్టిన కావ్య‌క‌న్య‌క‌ల సంఖ్య దిన‌దిన‌ము ప్ర‌వృధ్ధ‌య‌గుచు సాటిరాజుల‌ను మాత్స‌ర్య‌గ్ర‌స్తుల‌ను చేయుచున్న‌ది. ఒక్క కృష్ణాధ్వ‌ర క‌వియే ఎన‌మండుగ‌రురు క‌న్య‌ల నాయ‌న‌కిచ్చి అష్ట‌మ‌హిషీ క‌ల్యాణ‌ము నొన‌రించినాడు.

శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌ఘునాథ భూర‌మ‌ణులు శార‌దాల‌య‌మును నిర్మించినారు. స‌ర్వ‌భార‌త‌దేశంలోను, స‌నాత‌న కాల‌ము నుండి అధునాత‌న కాల‌ము వ‌ర‌కు ఋషితుల్యులైన మ‌హాభావుల‌చేత విర‌చింప‌బ‌డిన గ్రంథ‌ముల‌న్నింటినీ ఈ శార‌దాల‌య‌మున నిక్షేపంచ‌వ‌లెన‌న్న‌ది మ‌హారాజుల‌వారి ప్ర‌గాఢ‌వాంఛ‌, దీనికై వార‌హోరాత్ర‌ములు కృషిచేసి, సంవ‌త్స‌ర‌ముల త‌ర‌బ‌డి అనేక‌మంది పండితుల‌కు ధ‌న‌రాసులిచ్చి, దేశ‌ములోని మూల‌మూల గ్రామాల‌కు స‌హితం గ్రంథ‌ప్ర‌తుల‌ను వ్రాసి తెచ్చుట‌కు పంపిరి. వారు గ్రంథ‌ముల‌తో తిరిగి వ‌చ్చిరి. సాహిత్య విష‌య‌మిట్లుండ‌గా సంగీత శాస్త్ర‌మున‌, నాట్య‌శాస్త్ర‌మున పండితులు అనేక శ్ర‌మ‌ద‌మాదుల‌కోర్చి ప‌రిశోద‌న‌ల‌ను చేసి నూత‌న‌రీతుల‌ను సృష్టించిరి.